రామ్ చివరకు ఆ రీమేక్ దగ్గరకే వచ్చి ఆగాడు

రామ్ నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్సైంది, డిటేల్స్

ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవటంతో రామ్ కు ఏం చేయాలో అర్దం కాని పరిస్దితి ఏర్పడింది. నెక్ట్స్ ఏ సినిమా చేయాలి..హిట్ వచ్చిన జోనర్ లోనే మాస్ సినిమా చేయాలా..లేక తనకు అలవాటైన ఫన్, రొమాంటిక్, లవ్ స్క్రీమ్ లో వెళ్లిపోవాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇస్మార్ట్ శంకర్ విడుదలైన వెంటనే ..ఇక నుంచి తను మాస్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. తన తెలిసున్న దర్శకులను ఓ మాస్ కథతో రమ్మని అడిగాడు. అప్పటికే ‘తడం’ తమిళ రీమేక్ ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేద్దామని ఫిక్సై వర్క్ ప్రారంభించింది ..హోల్డ్ లో పెట్టేసాడు.

అయితే చాలా మంది సీనియర్, జూనియర్ ..మాస్ కథలు విన్నాక..తను ఆ రీమేక్ చేయటమే ఉత్తమం అని ఫిక్సయ్యాడట. అందుకే తన స్నేహితుడైన కిషోర్ తిరుమలని ఈ రీమేక్ కథ తెలుగుకు తగ్గట్లు చేయమని పురమాయించాడట. దాంతో అక్కడ మీడియా తమిళ హిట్‌ ‘తడం’లో నటించే అవకాశాలు ఉన్నట్లు వచ్చేసింది.

తమిళ నటుడు, విలన్ పాత్రల్లో కనిపించే …అరుణ్‌ విజయ్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. మార్చి 1న కోలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో స్రవంతి రవి కిశోర్‌ సినిమా హక్కుల్ని సొంతం చేసుకున్నారట. హీరోగా రామ్‌ను అనుకుని కొన్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మరికొన్ని నెలల్లో చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రామ్‌ ఇంకా స్పందించలేదు. ఒకవేళ ఆయన ఇందులో నటించకపోతే, మరో హీరోతో స్రవంతి రవికిషోర్‌ ఈ సినిమాను తీసే అవకాశం ఉందని చెప్తున్నారు.