రాజ్ త‌రుణ్ సినిమా ప‌రిస్థితి ఇక‌ అంతేనా…?

రాజ్ త‌రుణ్

క‌రోనా కార‌ణంగా రాజ్ త‌రుణ్ కెరీర్‌ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయింది. త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం `ఒరేయ్ బుజ్జిగా`. విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌కుడు. శ్రీ స‌త్య‌సాయి అర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హెభా ప‌టేల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని ముందు మార్చి నెలాఖ‌రులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ఏప్రిల్‌కి వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ని పొడిగించ‌డంతో ఈ మూవీ ఏప్రిల్‌లోనూ విడుద‌ల‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అదే జ‌రిగితే రాజ్ త‌రుణ్ కెరీర్ ఖేల్ ఖ‌త‌మ్ అన్న‌ట్టే. అయితే ఈ సినిమాపై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ వ‌ట్టి రూమ‌ర్లేన‌ని, మా చిత్రాన్ని థియేట్రిక‌ల్ రిలీజ్ చేస్తామే కానీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేయ‌మ‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చాక ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత కె.కె. రాధామోహ‌న్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజ్ త‌రుణ్ ఊపిరి పీల్చుకున్నార‌ట‌.