బెంజ్ క్లబ్ లో చేరినా హాట్ యాంకర్ ఉదయభాను

ఇంత‌కు మందు స్టార్ హీరోలు బెంజి కార్లు కొంటె అదో గొప్ప‌. కానీ ట్రెండు మారింది కాలం మారింది. ఇప్పుడు బెంజి కార్ల‌ని హీరోల అసిస్టెంట్ లు, యాంక‌ర్‌లే కొనేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఇదొక ట్రెండుగా మారింది. బెంజి సెల‌బ్రిటీకి సింబ‌ల్‌గా మార‌డంతో యాంక‌ర్‌లు, అసిస్టెంట్‌లు కూడా బెంజి కార్ల‌ని నానో కార్లు కొన్నంత ఈజీగా కొనేస్తున్నారు. ఇటీవ‌ల వ‌రుస పెట్టి యాంక‌ర్‌లు, హీరోల అసిస్టెంట్‌లు బెంజి కార్లు కొనేస్తూ షాకులమీద షాకులిస్తున్నారు.

ఇటీవ‌ల బిగ్ బాస్ విన్న‌ర్ కూడా బెంజి కార్ కొనేయ‌డం సోష‌ల్ మీడియాలో ఆ ఫొటోల్ని షేర్ చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా ఈ జాబితాలో క్రేజీ యాంక‌ర్ ఉద‌య‌భాను కూడా చేరిపోయింది. 2016లో వివాహం చేసుకున్న ఉద‌య‌భాను ఇద్ద‌రు క‌ల‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ కార‌ణంగా యాంక‌ర్ గా కొంత విరామం తీసుకున్నఉద‌య‌భాను తాజాగా బెంజి కార్‌ని ఖ‌రీదు చేసింది. వైట్ క‌ల‌ర్ బెంజి ముందు భ‌ర్త. పిల్ల‌తో క‌లిసి ఫొటోల‌కి పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.