మ‌హేష్‌ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ దెబ్బ‌?

మ‌హేష్ – ప‌ర‌శురామ్ మూవీకి మైత్రీ మూవీమేక‌ర్స్ పెద్ద అడ్డంకిగా మార‌బోతోందా? అంటే నిజ‌మే అని ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌నుకున్న మ‌హేష్ త‌ను చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ స్థానంలోకి మైత్రీ మూవీమేక‌ర్స్ చిత్రాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడ‌ని క‌మిట్ అయిన మైత్రీ ఇప్పుడు అత‌న్ని ఒప్పించేందుకు నానా తంటాలు ప‌డుతోంది. అదేంటి? టాలీవుడ్ మైత్రీ పేరున్న సంస్థ‌. అందులో సినిమాలు చేయాల‌ని స్టార్ డైరెక్ట‌ర్‌లు పోటీప‌డుతుంటే ప‌ర‌శురామ్ ఎందుకు మొండికేస్తున్నాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

`గీత గోవిందం` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ర‌శురామ్‌కు బిగ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీలు వ‌రుస పెట్టి అడ్వాన్సులు ఇచ్చాయి. అలా అడ్వాన్స్ ఇచ్చిన సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. కొన్ని రోజుల‌ క్రితం ప‌ర‌శురామ్ 14 రీల్స్ ప్ల‌స్ లో నాగ‌చైత‌న్య హీరోగా ఓ సినిమాకు సైన్ చేశాడు. ఇటీవ‌లే దానికి సంబ‌ధించిన మీడియాకు న్యూస్‌ని కూడా వ‌దిలారు. అది మైత్రీ నిర్మాత‌ల‌కు న‌చ్చ‌లేద‌ట‌. దాంతో తాము ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయ‌మ‌ని, త‌న‌తో సినిమా చేయాల‌నుకోవ‌డం లేద‌ని తెగ ఇబ్బంది పెట్టార‌ట. ఇప్పుడు అదే వారికి మెడ‌కి చుట్టుకుని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది.

త‌న‌ని ఇబ్బంది పెట్టారు కాబ‌ట్టి త‌ను మైత్రీ వారికి సినిమా చేయ‌న‌ని మ‌హేష్‌తో ప‌ర‌శురామ్ తెగేసి చెప్పార‌ట‌. దాంతో మ‌హేష్ మ‌రో నిర్మాత‌ని లైన్‌లోకి దింపాలా లేక ప‌ర‌శురామ్‌ని మైత్రీ వారినే క‌న్విన్స్ చేసుకోమ‌ని చెప్పాలా అని మ‌హేష్ ఆలోచిస్తున్నాడ‌ట‌.