కొంత మందిని తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రపంచంతో షేర్ చేసుకోవడం ఇష్టం వుండదు. కానీ కొంత మందికి మాత్రం ప్రైవసీని కూడా పబ్లిక్ చేసేస్తుంటారు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ పెరుగుతున్న వేళ లాక్డౌన్ పిరియెడ్ని మళ్లీ మే 3 వరకు పొడిగించారు.
ఇదే సమయంలో ఇంటి పట్టునే వుంటున్న స్టార్స్‌కి `బి ది రియల్ మెన్ ` ఛాలెంజ్‌ని `అర్జున్‌రెడ్డి` దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తగిలించాడు. రాజమౌళిని లా ఛాలెంజ్ లోకి లాగడంతో ఇప్పుడిది ఇండస్ట్రీ మత్తం పాకేస్తోంది. రామ్‌చరణ్ , ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ, సుకుమార్, కీరవాణి ఈ ఛాలెంజ్‌ని పూర్తి చేశారు. ఎన్టీఆర్ ఏకంగా సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలని ఈ ఛాలెంజ్‌లోకి లాగాడు. ఈ నలుగురిలో చిరు, వెంకీ మినహా బాలకృష్ణ, నాగార్జున ఈ ఛాలెంజ్‌ని స్వీకరించడం కష్టమే.
విప్కర కాలంలో పిల్లచేష్టలేంటని విమర్శలు ఎదురయ్యే ప్రమాదం వుంది. పైగా బాలయ్య, నాగార్జున ఇలాంటి పనులకు దూరం. నాగార్జున కొంత ఓకే చెప్పినా బాలయ్య మాత్రం ఇందుకు ఓకే చెప్పి ఛాలెంజ్‌ని స్వీకరించడం కష్టమే. ఇంత మంది స్టార్ హీరోల మధ్య తిరుగుతున్న ఈ ఛాలెంజ్ మహేష్‌ని మాత్రం చేరడం లేదు. మహేష్‌తో ప్రత్యేక అనుబంధం వున్న రామ్‌చరణ్, ఎన్టీఆర్, కొరటాల శివలు మాత్రం మహేష్‌ని ఛాలెంజ్‌కి నామినేట్ చేయలేదు. దీంతో మమేష్కు ఇందులో పాల్గొనడం, ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇష్టం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.