కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా కరోనా మరణమృదంగమే. దీని భారీ ఉంచి భయటపడాలంటే నివారణ ఒక్కటే మార్గమని, అంతా ఇంటి పట్టునే వుండాలని దేశాలన్నీ లాక్‌డౌన్‌ని ప్రకటించాయి. మన దేశంలోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని విధించారు.
దీంతో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా దేశ వ్యాప్తంగా కరోరా పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పలుగా పెరుగుతూనే వున్నాయి. దీంతో మరోసారి ప్రజల నుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ మహమ్మారిని తరిమేయాలంటే మన ఐక్యతను చాటాలని, కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి అందరూ లైట్లు ఆఫ్ చేసి 9 గంటల 9 నిమిషాల పాటు జ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు.
ప్రధాని పిలుపుకు యావత్ దేశం మొత్తం స్పందించి క్యాండిల్స్ వెలిగించింది. సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో పాల్గొన్నారు. అయితే కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించి పటాసులు కాల్చారు. దీంతో పెద్ద మంటలు భవనాలపై ఎగిసిపడ్డాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంలో మంచు మనోజ్‌కి మండింది. `ఇడియట్స్ బాంబులు పేల్చడం ఆపండ్రా..అలాంటి పనులు చేయొద్దని మిమ్మల్ని ఎవరూ ప్రశ్నించడం లేదా?. నాకు తెలిసి చదువుకున్న జీ బలిసిన వాళ్లే ఇలాంటి వెధవ పని చేసుంటారు. మనుషుల్లాగ పరిణతితో వ్యవహరించండి` అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
Idiots stop bursting crackers 🙏🏻 no one asked u too … I’m sure only G balisina educated lot r doing this …. please guys 🙏🏻 let’s be humans and not morons 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 5, 2020