ఈ కండోమ్ గోల ఏంటి పాపా?
`ఆర్.ఎక్స్.100`లో తన సెక్సీ ఫీల్సింగ్స్ తో కుర్రకారు మతి పోగొట్టిన పాయల్ తాజాగా `ఆర్.డి.ఎక్స్.లవ్`లో ఇంకాస్త జోష్ ఎక్కువే చూపింది. `ఆర్.ఎక్స్.100` తర్వాత పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న సినిమా `ఆర్.డి.ఎక్స్.లవ్`. తేజస్కంచెర్ల ఇందులో హీరో. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. శంకర్ భాను దర్శకుడు. రథన్ సంగీతం చేశారు. సి.కల్యాణ్ తన హ్యాపీ మూవీస్ ద్వారా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ట్రైలర్ చూసిన వారు సేఫ్టీ సెక్స్ గురించి ఈ సినిమాలో చర్చించారంటూ మాట్లాడుకున్నారు. అయితే ఆ తర్వాత రీసెంట్ గా వదిలిన ట్రైలర్ యాక్షన్ సినిమాలాగ ఉండటంతో ఆశ్చర్యపోయారు. , పాయల్ రాజపుట్ కేంద్రంగా ఉండే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలింగా చూపించారు. పాయల్ చేత కొన్ని పవర్ ఫుల్ డైలాగులు కూడా చెప్పించారు.అయినా పెద్దగా క్రేజ్ క్రియేట్ కాలేదు.
అందుకేనేమో పాయిల్ రాజ్ పుత్ ఇదికాదు పద్దతి అనుకుంది. సేఫ్ సెక్స్, అబార్షన్స్, పీరియడ్స్ గురించి మాట్లాడటం మొదలెట్టింది. రీసెంట్ గా ఓ ప్రమోషనల్ ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ…కండోమ్స్ వాడటం ఎలా అనేది ప్రతీ ఒక్కరూ మన సమాజంలో మాట్లాడుకోవాల్సిన విషయం అని చెప్పుకొచ్చింది. ఆ రకమైన ఓపెన్ నెస్ సొసైటిలో మిస్ అవుతోందని చెప్పుకొచ్చింది. అలాగే తమ చిత్రం టీజర్ లో చూపినట్లుగా న్యూడిటీ, ముద్దులు, ఇంటిమేట్ సీన్స్ మాత్రమే కాకుండా వేరేవి కూడా ఉన్నాయంది. ఇదంతా విన్న వారికి ఇంతకీ పాయిల్ ఏం చెప్పాలనుకుంటోందనే విషయమై క్లారిటీ మాత్రం రాలేదు.
పాయల్ రాజ్‌పుత్‌కి ఇప్పుడు చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి. ఆమె వెంకటేష్ సరసన వెంకీమామలో టీచర్‌గా నటిస్తోంది. మరోవైపు డిస్కో రాజాలో రవితేజ పక్కన నటిస్తోంది.