తమిళ స్టార్ హీరో సూర్య చిక్కుల్లో పడ్డారు. అతని సినిమాల్ని ప్రదర్శించరాదని తమిళ థియేటర్స్ యూనియన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించే చిత్రాల్ని తమ థియేటర్లలో ప్రదర్శనకు అనుతించకూడదని కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. థియేటర్స్ యజమానులు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం జ్యోతిక సినిమా అని తెలిసింది.
జ్యోతికి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెతో 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మించిన చిత్రం `పోన్ మగల్ వందల్`. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం లేదని, మే మొదటి వారంలో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని హీరో సూర్య ప్రకటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ విషయం తెలిసి థియేటర్ సిబ్బంది సూర్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముందు థియేటర్లో రిలీజ్ చేయాలని, ఆ తరువాతే మిగతా ప్లాట్ ఫాంలలో రిలీజ్ చేయాలని థియేటర్ సిబ్బంది సూర్యని కోరినా అంగీకరించలేదట. దాంతో ఆగ్రహానిరకి గురైన థియేటర్ల సంఘం ఇకపై సూర్య నిర్మించే ఏ చిత్రాన్ని కూడా థియేటర్లలో ప్రదర్శనకు అనుమతించమని ప్రనకటించడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. గతంలో డీటీహెచ్ విధానంలో `విశ్వరూపం` చిత్రాన్ని విడుదల చేస్తానని ఆ తరువాతే థియేటర్లలో రిలీజ్ చేస్తానని కమల్ ప్రకటించడం వివాదం అయిన విషయం తెలిసిందే.