మా మధ్య కాలంలో వచ్చే చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమాలే. అలాగే వాటి కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడుతూ సినిమాలు తీస్తున్నారు నిర్మాతలు. ఇక 2010-2020 సంవత్సరాల్లో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ పదేళ్ళు సినీ అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి1,2 చిత్రాలు ముందుగా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. అక్కడి నుండి మొదలయ్యాయి ప్యాన్ ఇండియా ఫిల్మ్స్. బాహుబలిలో నటించిన ప్రభాస్ మళ్ళీ తిరిగి అదే స్థాయి బడ్జెట్ క్రేజ్ ఉన్న సినిమా అయితేనేగాని తన కెరియర్‌కి బలంగా ఉంటుందన్న నమ్మకంతో సాహో కూడా అదే భారీ బడ్జెట్‌తో తన సొంత నిర్మాణంలో నిర్మించారు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక ఈ చిత్రం పెద్ద హిట్ కాలేదు కానీ కలెక్షన్లు భారీగా రాబట్టింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించే మరో చిత్రం రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్. ఆదికూడా రూ.400కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రం 2020కి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సైరా’. రామ్ చరణ్ కొణిదల బ్యానర్ పై రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం విడుదలై కథ పరంగా ఓకే అనిపించుకుంది కానీ ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’.మే9న ప్రేక్షకుల ముందుకు వచ్చి. పర్వలేదనిపించుకుంది. ఇక బాలీవుడ్, మాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాలు ‘కళంక్’, ‘బహ్మాస్త్ర’, ‘మరక్కర్’(మలయాళం) ఇవి కూడా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ‘బ్రహ్మస్త్ర’లో అమితాబచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, ఆలియా భట్ వంటి నటులు నటిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు. 2020లో విడుదల కాబోతోంది. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట సినిమా ‘కళంక్’. అభిషేక్ వర్మన్ దర్శకుడు. ఇందులో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ కపూర్ తదితరులు నటించారు. ఇక మాలీవుడ్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా ‘మరక్కర్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్, సునీల్ శెట్టి, అర్జున్షారా, సిద్దిఖి, ప్రభుదేవా, సుదీప్‌లు నటిస్తున్నారు. రూ.100కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. 2020లో విడుదల కాబోతోంది.
అలాగే కేజీఎఫ్ కూడా భారీ బడ్జెట్ సినిమానే అయితే విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అలాగే అనుకున్న బడ్జెట్ కూడా రాబట్టుకుంది. అలాగే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం కథ పరంగా పెద్దగా హిట్ కాలేకపోయినా కలెక్షన్లు పరంగా భారీగానే రాబట్టుకుంది.