`అల వైకుంఠపురములో` హిట్‌తో అల్లు అర్జున్ ప్రస్తుతం మేఘాల్లో తేలిపోతున్నాడు. తను తొలిసారి ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవడంతో ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. గత నెల 12న సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఓవర్సీస్లో టాప్ 3 ప్లేస్‌లో నిలిచి బన్నీ నటించిన చిత్రాల్లో సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మాటల గారడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం సరికొత్త రికార్డుల్ని సృష్టించి భారీ లాభాల్ని అందించింది. ఈ చిత్రం విడుదలై ఈ నెల 26తో 46 రోజులు పూర్తి కాబోతున్నాయి. ఇదే రోజున ఈ చిత్రం డిజటల్ ప్లాట్ ఫామ్ సన్ నెక్స్ట్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వార్త ఫ్యాన్స్‌ని ఓ పక్క షాక్‌కి గురిచేస్తూనే మరో పక్క ఆనందాన్ని కలిగిస్తోందట. ఇంత త్వరగా స్ట్రీమింగ్కి రావడం షాకింగ్‌గా వుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ పై మాస్టర్ ప్రింట్‌ని చూసుకోవచ్చని అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారట.
ఇదిలా వుంటే సన్ నెక్స్ట్ ఓటీటీ లో 26న `అల వైకుంఠపురములో` స్ట్రీమింగ్ కావడం లేదని, త్వరలోనే మరో డేట్‌ని ప్రకటిస్తారని తెలిసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారట. తమ సహనాన్ని సన్ నెక్స్ట్ పరీక్షిస్తుండటంతో ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారట. ఫ్యాన్స్ మాట అటుంచితే 50 డేస్ కూడా పూర్తి కాకుండా `అల వైకుంఠపురములో` స్ట్రీమింగ్ కి పెట్టడం ఆశ్చర్యంగా వుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.