బ‌న్నీ `పుష్ప‌` కోసం మ‌రో స‌ర్‌ప్రైజ్‌!

బ‌న్నీ `పుష్ప‌` కోసం మ‌రో స‌ర్‌ప్రైజ్‌!

అల్లు అర్జున్ తొలి సారి ఊర మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్టారు సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ై అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా చిత్రంగా దీన్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. క‌న్న‌డ క్రేజీ గాళ్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ని చెప్పారు కానీ తాజాగా ఆయ‌న ఈ చిత్రం నుంచి త‌ప్పుకోబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. పాత్ర మ‌రీ ర‌గ్గ‌డ్‌గా వుండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని, ఇలాంటి పాత్ర చేయ‌డం వ‌ల్ల హీరోగా త‌న మార్కెట్ దెబ్బ‌తినే ప్ర‌మాదం వుంద‌ని విజయ్ సేతుప‌తి భావిస్తున్నార‌ట‌.

ఇదిలా వుంటే ఈ చిత్రంలో మ‌రో హీరోయిన్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. రంగ‌మ్మ‌త్త అన‌సూయ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్న సుకుమార్ మ‌రో హీరోయిన్‌గా నివేదా థామ‌స్‌ని ఫైన‌ల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు తెలిసింది. ఇందులో నివేద పాత్ర బ‌న్నీ ల‌వ‌ర్‌గా క‌నిపిస్తుంద‌ట‌. ఈ పాత్రకు సినిమ‌యాలో ప్ర‌ధాన్య‌త చాలానే వుంటుంద‌ని తెలిసింది. నివేద క్యారెక్ట‌ర్ బ‌న్నీ చిత్రానికి ఓ స‌ర్‌ప్రైజ్ని చెబుతున్నారు. నివేదా ఇటీవ‌ల ర‌జ‌నీ న‌టించిన `ద‌ర్బార్‌` చిత్రంలో కీల‌క పాత్ర‌ని పోషించిన విష‌యం తెలిసిందే.