బన్నీ 18 నెలల కష్టం `అల వైకుంఠపురములో`. ఈ సినిమాకు ముందు తాను ఎక్కడున్నాడు?. ఏ సినిమాలు చేస్తున్నాడు?. అసలు రేసులోనే వున్నాడా? అనే అనుమానాలతో కొంత డిస్ట్రబ్ అయ్యాడట బన్నీ. దాంతో చేయబోయే సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని ముందు గట్టిగా అనుకున్నాడట. దీని కోసం కొత్త టీమ్‌ని, తన సొంత ఆర్మీని రంగంలోకి దింపిర బన్నీ వాళ్లు అడిగింది కాదనకుండా ఇస్తూ వెళ్లాడట. సినిమా ప్రారంభం, సంగీతం, క్యాస్టింగ్, ప్రమోషన్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్.. ఇలా ఏ ప్లాట్ ఫామ్ ని వదల కుండా తన సినిమా ప్రచారం కోసం వాడుకునేలా ప్లాన్ చేశాడు.
గతంలో ఏ సినిమాకు ఇన్వాల్వ్ కానంతగా ఈ సినిమాకు బన్నీ అన్నీ తానై నిలిచాడు. వెరసి మొత్తానికి అనుకున్నట్టుగానే `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డుల్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం అన్నింటినీ వాడుకున్న బన్నీ మీడియాని కూడా ఓ రేంజ్లో వాడేసాడు. మొత్తం 10కి మించి ఈ సినిమా కోసం ఈ వెంట్లని, ప్రెస్మీట్లని పెట్టేశారు. అన్ని రకాల ప్రమోషన్స్‌కి కలిపి బన్నీ ఈ సినిమాకు ఖర్చు చేయించిన మొత్తం అక్షరాలా 6 కోట్లని తేలింది. ఎంత ఇండస్ట్రి హిట్ అయితే మాత్రం ఈ రేంజ్లో ఖర్చు పెట్టాలా అదీనూ ప్రొడ్యూసర్ డబ్బులు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.