బీచ్ లో… డైరెక్టర్ టార్చర్ చేసాడు -హీరోయిన్ సంజన

బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన గుర్తుందా? ఎందుకు గుర్తు ఉండదులెండి… ఆ సినిమాతో అంత పాపులర్ అయ్యింది ఈ భామ. అంతకుముందు ఎన్ని సినిమాలలో నటించినా రాని ఫేమ్ ఆ మూవీతోనే వచ్చింది ఆమెకి. ఆ సినిమా తర్వాత ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అదే ఉత్సాహంలో కన్నడలో తను నటించిన ఒక సినిమాను తెలుగులో డబ్ చేసి ‘మొగుడు పెళ్ళాం ఓ బాయ్ ఫ్రెండ్’ అనే టైటిల్ పెట్టి రిలీజ్ చేసారు. బాగా హిట్ అవుతుంది బోలెడంత క్యాష్ తెచ్చిపెడుతుంది అనుకుంటే అది కాస్తా ఫట్ అయ్యింది. బుజ్జిగాడులో పద్దతిగా ఒద్దికగా కనిపించిన ఈ అమ్మడు ఈ సినిమాలో మాత్రం ఓవర్ గా ఎక్స్‌పోజ్ చేసి విమర్శల పాలయ్యింది. అసలు ఇది హిందీలో మర్డర్ సినిమాకు రీమేక్. అందులో మల్లికా శరావత్ ఎక్స్‌పోజింగ్ స్ఫూర్తిగా తీసుకుంది కాబోలు సంజన కూడా అలానే రెచ్చిపోయింది. బుజ్జిగాడు సంజనను ఆ క్యారెక్టర్లో చూసి ఒకింత షాక్ అయ్యారనే చెప్పాలి. కానీ అలా చేయటం తనకి కూడా నచ్చలేదంట తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సొచ్చిందంట. కెరీర్ స్టార్టింగ్ లో గ్లామర్ రోల్స్ చేయకపోతే తర్వాత ఆఫర్లు రావేమో అనే భయంతో అలా చేసిందట.

ఈ విషయాలన్నీ సినిమా పేరు బయట పెట్టకుండానే చెప్పుకొచ్చింది. అసలు విషయానికి వస్తే ఆ సినిమా షూటింగ్ టైములో డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడంట. ఆ విషయాలన్నీ ఓ కార్యక్రమంలో వివరించింది ఈ నటీమణి. ఆ సినిమాకి తాను తీసుకున్న పారితోషకం కేవలం 2 లక్షలేనట. పొట్టి బట్టలేసుకోవాలని, బోల్డ్ సీన్స్ చేయాలనీ తెలిసాక మూవీ నుండి తొలగిపోవాలని అనుకుందట. తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేయడానికీ సిద్ధమైంది కానీ దర్శకుడు అగ్రిమెంట్ చూపించి కేసు పెడతా అని బెదిరించడంతో చేసేది లేక ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ సీన్లలో యాక్ట్ చేశాను అని తెలియజేసింది. ఇక ఆ సినిమా షూటింగులో దర్శకుడు బాగా ఇబ్బంది పెట్టాడట. బీచ్ సీన్స్ లో ప్రమాదకర పరిస్థితుల్లో కూడా తనకి పొట్టి పొట్టి దుస్తులు వేయించి ఇంటిమేట్ సన్నివేశాలు చిత్రీకరించారని వాపోయింది.

ఆ సినిమా విడుదల అయ్యాక తల్లిదండ్రులతో కలిసి సినిమా చూడటానికి థియేటర్ కి వెళ్లిందట. అందులోని సన్నివేశాలు చూసి తన తండ్రి ఇలాంటి కూతురిని ఎందుకు కన్నానా అని బాధ పడ్డారట. గిల్టీగా ఫీల్ అవుతున్న సంజనని ఓదార్చి తనకి సపోర్ట్ గా నిలిచారట ఆమె తల్లి. బుజ్జిగాడుకంటే ముందే ఇంతకీ సంజనని అంతలా ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ ఎవరంటే కన్నడ ఇండస్ట్రీకి చెందిన రవి వత్సవ. కన్నడలో ఈ సినిమా గండ హెండతి గా రిలీజ్ అయ్యింది. సంజన అన్ని ఇబ్బందులు ఎదుర్కొని నటించినా ఆ సినిమా మంచి బ్రేక్ ఇవ్వలేదు. చెప్పుకునేంత గొప్పగా రెమ్యూనరేషన్ కూడా లేదు. తండ్రితో చీవాట్లు తప్పలేదు. తెలుగులో డబ్ చేయటంతో అప్పటివరకు ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యింది. ఈ సినిమా వలన సంజనకు ప్లస్ అయింది ఎంతో తెలియదు కానీ మైనస్ లు మాత్రం చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సంజన ఒక మలయాళ మూవీలో నటిస్తున్నట్టు సమాచారం.