ప్రభాస్‌ ఇలా షాక్ ఇచ్చాడేంటి

తనది లవ్ మ్యారేజ్ అంటూ షాక్ ఇచ్చిన ప్రభాస్‌

స్టార్ హీరో ప్రభాస్‌ వివాహ విషయం చాలా కాలంగా మీడియాకు అత్యంత ఇష్టమైన విషయంగా మారింది. అంతేకాదు ఆయన వివాహ విషయాలు అంటే ఫ్యాన్స్ కు చాలా ఆసక్తి. దాంతో ఆయన మీడియాతో మాట్లాడితే అందులో ఓ ప్రశ్న ఖచ్చితంగా ఆయన వివాహం గురించి ఉంటుందనేది నిజం. తాజాగా ఆయన్ను పెళ్లి గురించి బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. ప్రభాస్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? అని అడగగా.. ‘పెళ్లి జరగాల్సిన సమయంలో జరుగుతుంది. అది ప్రేమ వివాహం కూడా కావొచ్చు’ అని అని ఆశ్చర్యపరిచారు.

అంటే ప్రభాస్ మనస్సులో ఎవరో ఓ అమ్మాయి ఉన్నట్లేగా అంటున్నారు ఫ్యాన్స్. అనుష్క అని మరికొందరు అంటూంటే మరికొందరు కాజల్ అంటున్నారు. అదేమీ కాదు..వాళ్ల కుటుంబంలో ఓ అమ్మాయి ని ఆయనతో ప్రేమలో ఉన్నాడని మరికొందరు డిస్కస్ చేస్తున్నారు. ఆ విధంగా మరోసారి ప్రభాస్ తన వివాహ విషయమై డిస్కషన్ కు తెర లేపారు.

అలాగే ‘సాహో’ కోసం రూ.100 కోట్లు రెమ్యునేషన్ గా తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. ‘ఈ సినిమా ప్రొడ్యూసర్ నా ప్రెండ్. కేవలం ఓ ఫైట్ సీన్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశాం. సినిమాలోని ఓ భాగం బడ్జెట్‌ నా రెమ్యునేషన్’ అని ప్రభాస్‌ చెప్పారు.

‘సాహో’ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం రామోజీఫిల్మ్‌ సిటీలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరగుతోంది.