కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, కన్నడ హీరో నిఖిల్ గౌడ శుక్రవారం ఉదయం రేవన్న కుమార్తె రేవతిని 9:30 గంటలకు బెంగళూరు సమీపంలోని రామనగరంలో వున్న ఫామ్ హౌజ్లో సాదా సీదాగా వివాహం చేసుకున్నారు. దీనిపై దుమారం మొదలైంది. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ సామాజిక దూరం పాటించాలని నిబంధనలు చెబుతున్నా వాటిని లెక్కచేయకుండా వివాహం జరిపించడంపై దుమారం మొదలైంది.
నిబంధనలకు విరుద్ధంగా ఈ పెళ్లిలో 60 నుంచి 70 మంది అతిథులు నపాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నటి రవీనా టాండర్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. కరోనా సంక్షభంలో పేదలు తమ కుటుంబాలను చేరుకోలేకపోతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని, మరి కొంత మంది ఈ విపత్తునుంచి బయటపడటానికి ఇతరులకు సహాయం చేస్తున్నారని, కానీ ధనవంతులు మాత్రం నిబంధనల్ని పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా పెళ్లి విందులో ఏం వడ్డించారోనని సెటైర్లు వేసింది.
నిఖిల్ వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదంపై మరింత దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీ వర్గాలు నిఖిల్ పెళ్లి వ్యవహారాన్ని మరింత సీరియస్గా తీసుకునే అవకాశం వుందని, ఈ సందర్భాన్ని వాడుకుని కుమార స్వామికి చుక్కలు చూపించడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నారు.