నాగ చైతన్య – సాయి పల్లవి – శేఖర్ కమ్ముల చిత్రం ప్రారంభం

వైవిధ్యమైన సినిమాలు చేసే శేఖర్ కమ్ముల ‘ఫిదా’ తో మళ్ళీ విజయం అందుకున్నారు. ఆ తరువాత మళ్ళీ కొంత విరామం తీసుకుని ఒక్కసారిగా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా సినిమా చేస్తున్నాని ప్రకటించారు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆసియన్ సినిమాస్ మొట్ట మొదటిసారిగా నిర్మాణ రంగంలో ప్రవేశిస్తూ నిర్మించడం విశేషం.

ఈ సినిమా నిన్న సికింద్రాబాద్ వినాయకుని గుడిలో ప్రారంభం అయింది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలు కాగా, సినిమా సంవత్సరాంతంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దీ రోజుల్లో తెలియనున్నాయి