దర్శకుడు యేలేటి తో నితిన్ కొత్త సినిమా ప్రారంభం

వైవిధ్యమైన సినిమాల దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి. ఆయనతో హీరో నితిన్ సినిమా నిన్న ప్రారంభం అయింది. భవ్య ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా ఈ సినిమా మరో ఆసక్తికరమైన సినిమా అంటున్నారు దర్శకుడు యేలేటి. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాక, ప్రియా ప్రకాష్ వాఱియర్ మరొక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

అయితే ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ చిత్రం షూటింగ్లో ఉన్నారు. అటు పైన ‘తొలి ప్రేమ’ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి తో కూడా మరొక సినిమాకి సంతకం చేశారు నితిన్. ఈ సినిమాకి ‘రంగ్ దే’ అనే టైటిల్ ఖరారు అయింది. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.