సినీ ఇండస్ట్రీని కరోనా వైరస్ చావు దెబ్బతీసింది. దీని కారణంగా మార్చి 25న రిలీజ్‌కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడిన విషయం తెలిసందే. అందులో దిల్ రాజు నిర్మించిన మల్టీస్టారర్ చిత్రం `వి` కూడా వుంది. ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడమే కాకుండా తను నిర్మాస్తున్న `వకీల్‌సాబ్` షూటింగ్ ఆగిపోయింది. మహేష్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించాలనుకున్న సినిమా స్టోరీ డిస్కర్షన్స్ దగ్గరే ఆగిపోయింది.
ఈ సినిమా కథా చర్చల కోసం భారీగానే ఖర్చు చేశాడు దిల్ రాజు. దర్శకుడు వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. వీటితోపాటు బాలీవుడ్‌తో నిర్మిస్తున్న `జెర్సీ` రీమేక్ కూడా లాక్‌డౌన్ కారణంగా ఆపేయాల్సి వచ్చింది. ఇదే కాకుండా తను డిస్ట్రి బ్యూటర్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన సినిమాలు థియేటర్ల బంద్ కారఫణంగా ఆగిపోవాల్సి వచ్చింది. అదీకాకుండా చేతుల్లో వున్న థియేటర్లని కరోనా ఎఫెక్ట్ కారణంగా మూసివేయాల్సిన పరిస్థితి.
ఇలా ఒకేసారి ముప్పెట దాడి తరహాలో అన్ని రకాలుగా నష్టాలు ఎదురవడంతో దిల్ రాజు వర్రీ అవుతున్నారట. మనో రెండు వారాల పాటు ప్రజల ప్రాణాల కన్నా డబ్బు ముఖ్యం కాదని సీఎం లాక్‌డౌన్‌కు ముందుకెళ్లారు. దీనిపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దిల్ రాజు మాత్రం భారీ నష్టాలు తనకు తప్పేలా లేవని ఫీలవుతున్నారట.