దిల్ రాజుకు మ‌ళ్లీ వార్నింగ్ ప‌డిందా?

`వ‌కీల్ సాబ్` ఇంత ప‌ని చేస్తాడ‌నుకోలేదు!

దిల్ రాజుకు మ‌ళ్లీ వార్నింగ్ ప‌డింది. సినిమా సెట్‌లో ఏం జ‌రుగుతోందో.. ఎవ‌రు ఫోన్‌లు వాడుతూ లీకుల‌కు పాల్ప‌డుతున్నారో తెలుసుకోకుండా లీకుల మీద లీకులు వ‌చ్చేస్తున్నా ఏమీ ప‌ట్ట‌న‌ట్టు చూస్తున్నారు. ఇలా అయితే సినిమా చేయ‌డం క‌ష్టం. ఇలాంటి త‌ప్పులు మ‌రోసారి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి మ‌ళ్లీ జ‌రిగితే సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల్సి వ‌స్తుంది` ఇది దిల్ రాజుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాన్ ఇచ్చిన తాజా వార్నింగ్‌.

కొంత విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ సినిమాలు మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్‌వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. తొలి రోజే ప‌వ‌న్‌కు సంబంధించిన పిక్స్ బ‌య‌టికి రావ‌డంతో టీమ్‌పై నిర్మాత దిల్ రాజుపై ప‌వ‌న్ సీరియ‌స్ అయ్యారు. తాజాగా యాక్ష‌న్ సీన్‌కి సంబంధించిన వీడియోనే బ‌య‌టికి రావ‌డంతో ఆగ్ర‌హానికి గురైన ప‌వ‌న్ మ‌ళ్లీ ఇది రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండ‌ని దిల్ రాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.