జోరు మీదున్న ఇస్మార్ట్ శంక‌ర్‌!

`ఇస్మార్ట్ శంక‌ర్`తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సంతం చేసుకున్నాడు రామ్‌. ఊర మాస్ మ‌సాల యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ని సాధించి హీరోగా రామ్ మార్కెట్ స్థాయిని పెంచేసింది. దాదాపు 44 కోట్ల వ‌ర‌కు వూళ్ల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమా త‌రువాత రామ్ న‌టిస్తున్న తాజా చిత్రం `రెడ్‌`. త‌మిళ హిట్ చిత్రం `త‌డ‌మ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌‌త్వంలో స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తొలిసారి రామ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్ర‌మిది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కావాల్సి వుంది. కానీ క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే వుంటున్న రామ్ కొత్త క‌థ‌ల‌పై దృష్టి పెట్టార‌ట‌.

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌ను క‌లిసి వ‌ర్క్ చేయాల‌నుకున్న ద‌ర్శ‌కుల‌కు ఫోన్ చేస్తున్నార‌ట‌. కొత్త క‌థ ఏదైనా వుంటే చెప్ప‌మంటున్నార‌ట‌. అలా కొత్త క‌థ‌లు వింటున్నార‌ట‌. ఇలా వింటున్న క‌థ‌ల్లో రెండు స్క్రిప్ట్‌ల‌ని ఫైన‌ల్ చేసి లాక్‌డౌన్ త‌రుఆత ప‌రిస్థితుల్ని బ‌ట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల్ని చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇస్మార్ట్ జోరుకు త‌గ్గ‌ట్టే ప్రొడ్యూస‌ర్స్ కూడా రెడీ అంటున్నార‌ట‌.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles