జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే చాలు చాలా మందిలో చాలా రక రకాల వైబ్రేషన్స్ మొదలవుతాయి. ఇక ఈయన సినిమాల్లో ఓ టాప్ రేంజ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ఆయనకు ఎందుకోగాని పెద్దగా ఆశక్తి లేకపోవడంతో ఒకటి రెండు సార్లు ప్రచారం అయితే చేశారుగాని పూర్తి స్థాయి రాజకీయాల్లో మాత్రం ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. ఒకవేళ అయితే ఎలా ఉందో చూడాలనుందా. అలా చూడాలనుకునేవారందరికి ఒక గుడ్ న్యూస్ త్వరలోనే ఎన్టీఆర్‌ని రాజకీయ నాయకుడుగా చూడబోతున్నారు. ఏంటి అందరూ షాక్ అయ్యారా? నిజమేనండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే కదా.
అయితే అందులో త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయనాయకుడుగా చూపించబోతున్నారని సమాచారం. అది కూడా ఏకంగా ఢిల్లీ స్థాయిలో రాజకీయాల పైన ఆయన చక్రం తిప్పుతారట. మరి దీంతో ఆయన్ని రాయకీయనాయకుడుగా ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఆశ నెరవేరినట్లే. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రస్తుతం టాలీవుడ్ నిషేక్ చేస్తున్నరష్మిక మండన్న ఎన్టీఆర్‌కి జంటగా నటించబోతుందట. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక పట్టాలెక్కడం ఒక్కటే ఆలస్యం. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్ ఆర్. షూటింగ్ పూర్తవగానే ఈ సినిమాలో జాయిన్ అవ్వడం ఒక్కటే పెండింగట.
ఈ చిత్రానికి `అయినను పోయి రావలె హస్తినకు` అనే టైటిల్‌ని కూడా త్రివిక్రమ్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులకు రాయబారం పంపే సన్నివేశం ఇద్దరి మధ్య సంధి కుదరకపోయినా తిక్కన్న వాడిన ఈ పదజాలం ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం షూటింగ్ విషయంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్లోనే షూటింగ్ మొదలు పెట్టేసి వచ్చే సంక్రాంతి లేదా కుదిరితే ఇంకా ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ గతంలో తన చిత్రాల్లో రాజకీయ నాయకుడుగా కొన్ని కొన్ని చిన్న చిన్న సన్నివేశాలు చేసిన పూర్తిస్థాయిలో అయితే ఎప్పుడూ చేయలేదు.