Home Tollywood చిరుతో బన్నికి చెడిందా..మరి ఈ కామెంట్ ఏంటి

చిరుతో బన్నికి చెడిందా..మరి ఈ కామెంట్ ఏంటి

‘సైరా’పై బన్నీ ఇంట్రస్టింగ్ కామెంట్స్‌

గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య విభేధాలు ఉన్నాయని, అవి ఈ మధ్యన పెద్దవయ్యాయంటూ వార్తలు మొదలయ్యాయి. వెబ్ మీడియాలో ఇవి ఓ వలయంలో తిరగటం మొదలెట్టాయి. దానికి ఆజ్యం పోస్తూ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదు. మొత్తం మెగా క్యాంప్ అంతా స్టేజీపై ఉన్నా అల్లు అర్జున్ కనపడలేదు. దాంతో అల్లు అర్జున్ ఎందుకు ఈ వేడుకకు రాలేదంటూ గుసగుసలు వినపడ్డాయి. తర్వాత అవి మీడియాలో పెద్ద వార్తలైపోయాయి. దానికి తోడు సైరా సినిమా గురించి బన్ని ఏమీ మాట్లాడకపోవటం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. అయితే వీటిన్నటికి బన్ని చెక్ చెప్పాడు. ఒకే ఒక సోషల్ మీడియా పోస్ట్ తో.

అల్లు అర్జున్‌ తన పోస్ట్ లో…. ‘సైరా.. నరసింహారెడ్డి.. మన మెగాస్టార్‌ చిరంజీవి గారి నుంచి వస్తోన్న అద్భుతమైన చిత్రం. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో ఆయన నటించాలని.. మగధీర సినిమాను చూసినప్పటి నుంచీ అనుకున్నాను. ఆ కోరిక నేటితో నిజమైంది. చిరంజీవి గారితో ఇలాంటి సినిమా తీసిన నిర్మాత, మై డియర్‌ బ్రదర్‌ రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌ అండ్‌ కంగ్రాట్స్‌.

ఓ తండ్రికి కొడుకు ఇవ్వగల గొప్ప బహుమతి ఇది. ఆయన లెగసీకి ఇదో నివాళి. చిత్రానికి పని చేసిన ప్రతిఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌. డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డికి నా తరుపున స్పెషల్‌ రెస్పక్ట్‌. మన హృదయంలో​ఎప్పటికీ మరిచిపోలేని మ్యాజిక్‌ను ఈ మూవీ క్రియేట్‌ చేయాలని, సైరా అంటూ నిత్యం మన గుండెల్లో వినిపించాలని కోరుకుంటున్నా’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా సైరాపై తనకున్న ప్రేమను వెల్లడించారు.

తొలి స్వతంత్ర్య సమరయోధుడి పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాక.. తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్‌ 2న ఈ మూవీ విడుదల కానుంది.

- Advertisement -

Related Posts

బంగారు బుల్లోడు రివ్యూ: రొటీన్ ట్రాక్‌లో వెళ్లిన అల్ల‌రోడు..ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం

చిత్ర టైటిల్‌ : బంగారు బుల్లోడు నటీనటులు : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి, పొసాని కృష్ణ మరళి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను,తదితరులు నిర్మాణ సంస్థ :...

ప్రభాస్ స్కై-ఫై.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక స్కై ఫై సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

మాస్టర్ ఎఫెక్ట్.. రేటు పెంచిన సేతుపతి

మాస్టర్ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా నెగిటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ వస్తోంది. 96 హిట్టుతో హీరోగా ఏ రేంజ్ లో క్లిక్కయ్యాడో అందరికి తెలిసిందే. అయినా కూడా కేవలం...

మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్ !

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జోరు మాములుగా లేదు. వరుస పెట్టి సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్...

Latest News