సోషల్ మీడియాలో ఎదురే లేని నాయికగా సమంతా అక్కినేని గురించి చెప్పాల్సిన పనే లేదు. మహమ్మారీ ప్రారంభ రోజుల్లో ఆమె తన అభిమానులకు స్వీయనిర్భంధం పేరుతో `కపుల్ గోల్స్` ఫిక్స్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఇంకా ఈ క్రైసిస్ సమయంలో తనలోని రకరకాల క్రియేటివిటీస్ ని బయటి ప్రపంచానికి ఆవిష్కరిస్తూనే ఉంది. తాజాగా అక్కినేని కోడలు సమంత మరోసారి సోషల్ మీడియాలో అభిమానులకు మరో కొత్త గోల్ ని ఫిక్స్ చేసింది.
ఇటీవల సమంత `కిచెన్ గార్డెనింగ్` నేర్చుకుంటోందిట. అందువల్ల ఇల్లు ఇంటి పరిసరాలను రసాయనాలు వాడకుండా సహజ పదార్ధాలతో శుభ్రపరచడంలో సహాయపడే బయో ఎంజైమ్లను సిద్ధం చేయడమెలానో చిట్కాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో పాటు వేరొక ఇంపార్టెంట్ విషయాన్ని అభిమానులకు చెప్పేందుకు ప్రయత్నించింది.
మనిషిపై ఎంతో ప్రభావవంతంగా పని చేస్తున్న `ఈషా క్రియా యోగా` ప్రారంభించాలని తాజాగా అభిమానులందరినీ కోరిన సామ్ మానసిక ప్రశాంతత.. ఆరోగ్యం కోసం 48 రోజుల ఇషా క్రియా యోగా చేయాలని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇప్పటికే తాను ప్రారంభించేసింది. మీరు ఇంకా ఎందుకు ఆలస్యం చేయడం? యోగా ప్రేమికులు సమంతా అభిమానులు.. అందరూ వీలైనంత త్వరగా ఇషా క్రియా యోగా ప్రారంభించేయండి అని చెబుతోంది. ప్రస్తుతం కరోనా టెన్షన్స్ అంతకంతకు ఊపిరాడనివ్వడం లేదు. ఇలాంటి సమయంలో సమంత చెప్పిన ఈషా క్రియా యోగా టిప్ మంచిదే. ఆచరణలో పెడితే మంచి ఫలితమే వస్తుంది. ఒత్తిడిని జయిస్తే వైరస్ ని జయించినట్టే మరి.
కెరీర్ సంగతి చూస్తే.. సమంత రెండు తమిళ చిత్రాలలో నటిస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో `కాతు వాకులా రేండు కదల్` లో నయనతార – విజయ్ సేతుపతిలతో కలిసి నటిస్తోంది. దీంతో పాటు నటుడు ప్రశాంత్ సరసన ఓ తమిళ చిత్రం చేస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకి, భర్త చైతన్యతో కలిసి వేరొక సినిమాకి ప్లాన్ చేస్తోంది.