కరోనా వైరస్ కారణంగా దేశం అల్లాడిపోతోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల నుంచి ఇండియా వచ్చిన వారిని చెక్ చేస్తున్న కార్పెరేషన్ సిబ్బంది పాజిటివ్ కేసులు తగిలితే ఆ ఇంటికి నోటీసులు అంటిస్తున్నారు. ఈ ఇంట్లో కరోనా వ్యాధిగ్రస్తుడు వున్నాడు జాగ్రత్త అంటూ పోస్టర్లు అంటిస్తున్నారు.
అయితే ఇలాంటి ఓ పోస్టర్‌నే కమల్‌హాసన్ ఇంటికి అంటించారు చెన్నై కార్పెరేషన్ సిబ్బంది. అయితే కమల్ గత కొంత కాలంగా ఏ ఇతర దేశాలకు వెళ్లలేదు. జనవరి నుంచి చెన్నైలోని తన ఇంటిలోనే వుంటున్నారు. పైగా పార్టీ కార్యకలాపాల కోసం తన పాటి ఇంటిని ఉపయోగిస్తున్నారు. ఆ ఇంటికే చెన్నై కార్పెరేషన్ సిబ్బంది నోటీసులు అంటించడం సంచలనంగా మారింది. దీనిపై కమల్ వివరణ ఇవ్వడంతో చెన్నై కార్పెరేషన్ సిబ్బంది జరిగిన పొరపాటుని గుర్తించి సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా పోస్తర్ అంటించామని వెంటనే తొలిగించాడం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా వుంటే కమల్‌తో విడిపోయిన గౌతమి పాస్ పోర్ట అడ్రస్ ఇప్పటికీ కమల్ ఇంటిదే వుందని తెలుస్తోంది. ఇటీవలే ఆమె దుబాయ్ నుంచి ఇండియా వచ్చారట. ఆమె పాస్ పోర్ట్‌ని చెక్ చేస్తే ఈ విషయం బయటపడినట్టు తెలిసింది.