నటరత్న నందమూరి తారక రామారావు స్థాపించిన రామకృష్ణా స్టూడియో చాలా మందికి ఎన్నో మధుర స్మృతులను మిగిల్చి ఉంటుంది. అలాంటి వారిలో ఇప్పుడు పత్రికాధిపతి, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి కూడా చేరిపోయారు. ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్న ‘దేవినేని’ చిత్రం షూటింగ్ ఈరోజు (మంగళవారం) రామకృష్ణా స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా తనకు ఈ స్టూడియో మిగిల్చిన మధురానుభూతిని సురేష్ కొండేటి పంచుకుంటూ ‘ఈ స్టూడియోలో ఎన్నో భారీ చిత్రాలను నిర్మించారు.
<
p style=”text-align: justify;”>స్వర్గీయ నందమూరి తారక రామారావుగారిని ఒకప్పుడు ఇదే స్టూడియోలో ఓ జర్నలిస్టుగా కలిశాను. ఎన్నో సినిమా షూటింగుల కవరేజిని జర్నలిస్టుగా చేశాను. ఇప్పుడు నటుడిగా ఈ స్టూడియోలో అడుగుపెట్టాను. ఓ వ్యక్తికి ఇంతకన్నా కావలసిన మధురానుభూతి ఏముంటుంది. ఈరోజు ఓ కొత్త శక్తి నాలో ప్రవేశించినట్లు అనిపించింది’ సురేష్ కొండేటి అన్నారు. బెజవాడ పేరెత్తితే వినిపించే పేర్లు వంగవీటి రంగా .. దేవినేని నెహ్రూ. ఇప్పుడు ఆ ఇద్దరి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. మంగళవారం రోజు సురేష్ కొండేటి, శివారెడ్డి, తేజ తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.