సలాం .. రాఖీ భాయ్.. !! సలాం రాఖి భాయ్ అంటూ కెజిఎఫ్ సినిమాతో కన్నడ పరిశ్రమనే కాదు దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపి సంచలనం క్రియేట్ చేసాడు యాష్. కన్నడలో బాహుబలి రేంజ్ లో సక్సెస్ అందుకున్న ఈ సినిమా అటు బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సూపర్ స్టార్ గా మారిపోయాడు హీరో యాష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సంచలన విజయం అందుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. కెజిఎఫ్ 2 పేరుతొ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుంది.
హ్యాండ్సమ్ లుక్స్ తో తన దైన స్టయిల్ లో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోపై హత్యకు కుట్ర జరిగింది అన్న న్యూస్ ఆలస్యంగా తెలియడంతో యాష్ ఫాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యాష్ ని చంపేందుకు స్లమ్ భరత్ అనే రౌడీ షీటర్ గతంలో ప్రయత్నించినట్టు సమాచారం ? స్లమ్ భారత్ అనే రౌడీ పై ఇప్పటికే యాభై కి పైగా కేసులు ఉన్నాయట, అందులో ఓ మర్డర్ కేసు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో స్లమ్ భరత్ ని పట్టుకున్న పోలీసులు, సీన్ రీ కంస్ట్రక్షన్స్ కోసం ప్రయత్నిస్తే భరత్ తప్పిచుకునే ప్రయత్నం చేసాడని, అక్కడ జరిగిన ఎదురు కాల్పుల్లో భరత్ మరణించాడు. అతని ఎంకౌంటర్ తో యాష్ పై హత్యాయత్నం జరిగిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
యాష్ పై థ్రెడ్ ఉందని సమాచారంతో పోలిసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. అయితే గత ఏడాది మార్చ్ లోనే యాష్ హత్యకు స్లమ్ భారత్ ప్రయత్నం చేసాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం పై అటు యాష్ కూడా అప్పట్లో స్పందించాడు. తనను చంపాలని వచ్చిన వార్తలను కండించాడు యాష్. అంతే కాదు ఎవరో వచ్చి హత్య చేసేందుకు తానేం గొర్రెను కాదని అన్నాడు యాష్.