Home Tollywood కాజల్ తో కాలక్షేపం..త్రివిక్రమ్ లో రసికత్వం

కాజల్ తో కాలక్షేపం..త్రివిక్రమ్ లో రసికత్వం

కాజల్ చేత స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు

హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో స్పెషల్ డాన్స్ లు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. సినిమా అంతా చేసినా వచ్చే రెమ్యునేషన్ లో సగం అయినా ఈ సాంగ్ లలో గిట్టుబాటు అవుతూండటంతో ఇలా స్పెషల్ సాంగ్ అంటే సై అనేస్తున్నారు. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో ఊగిపోయి కుర్రాళ్లను ఊపేసిన కాజల్ మరోసారి అలాంటి స్టెప్ లలో అలరించటానికి సిద్దపడుతోంది. అయితే ఈ సారి అల్లు అర్జున్ తాజా చిత్రంలో అని తెలుస్తోంది. అయితే కాజల్ తో ఎందుకని అబ్జెక్షన్ పెట్టినా, కావాల్సిందే అని త్రివిక్రమ్ పట్టుబడ్డారట. ఈ పాట మాంచి శృంగార సమాసాలతో సాగుతుందని చెప్తున్నారు. త్రివిక్రమ్ దగ్గరుండి మరీ ఈ పాటని రాయిస్తున్నాడట.

అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న అల వైకుంఠపురములో చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయటానికి కాజల్ ఒప్పుకుందని సమాచారం. ఈ మేరకు భారీ ఖర్చుతో అదిరిపోయే సెట్ ని హైదరాబాద్ లో వేస్తున్నారు. త్వరలోనే షూట్ ప్రాంభంకానుంది. ఈ మేరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ నిర్మాతల నుంచి రావాల్సి ఉంది.

వయస్సు పెరుగుతున్నా కాజల్ ఎక్కడా వెనకడగు వెయ్యకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. రీసెంట్ గా సీత, రణరంగం చిత్రాలతో పలకరించిన ఆమె ఇండియన్ 2 చిత్రంలో లీడ్ చేస్తోంది. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఆ చిత్రం సీక్వెల్ కమిటైంది. మరో రెండు తమిళ చిత్రాలు సైతం ఆమె చేస్తోందని వినికిడి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

క్రాక్ హిందీ రీమేక్ రైట్స్.. డిమాండ్ మామూలుగా లేదు

మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ డైలీ కోటికి తక్కువ రావడం లేదు. ఇక రానున్న రోజుల్లో థియేటర్స్...

మరో సినిమాతో బిజీగా మారనున్న మెగాస్టార్.. డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు....

Latest News