కల‌ర్స్ స్వాతి ఫొటోలు ఎందుకు డెలిట్ చేసింది?

కల‌ర్స్ స్వాతి ఫొటోలు ఎందుకు డెలిట్ చేసింది?

బుల్లి తెర క‌ల‌ర్స్ కార్య‌క్ర‌మంతో ఎంట్రీ ఇచ్చిన స్వాతి ఆ త‌రువాత క‌ల‌ర్స్ స్వాతిగా పాపుల‌ర్ అయింది. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా పాపుల‌ర్ కాలేక‌పోయింది. హీరోయిన్ చెల్లెలి పాత్ర‌ల్లో మెరిసింది. హీరోయిన్‌గా నిఖిల్ లాంటి హీరోల స‌ర‌స‌న చేసింది. పెద్ద హీరోల ప‌క్క‌న మాత్రం అవ‌కాశాల్ని పొంద‌లేక‌పోయింది.

దీంతో విసుగెత్తిన‌ స్వాతి 2018లో పైలెట్ వికాస్ వాసుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీక‌రించారు. అప్ప‌టి నుంచి సినిమాల‌కు శాశ్వ‌తంగా దూరంగా వుంటోంది. అయితే తాజాగా స్వాతి తాజాగా త‌న భ‌ర్త‌కు సంబంధించిన ఫొటోలని సోష‌ల్ మీడియా అకౌంట్ నుంచి తొల‌గించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

వికాస్‌కి, స్వాతికి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయా?.. ఆ కార‌ణంగానే స్వాతి అత‌ని ఫొటోల్ని త‌న సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలిగించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. హీరోయిన్ అమ‌లాపాల్ త‌ర‌హాలోనే స్వాతి కూడా త‌న భ‌ర్త వికాస్ నుంచి విడాకులు తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోందా? అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. విడాకుల‌కు ముందు అమ‌లాపాల్ త‌న పెళ్లికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా అకౌంట్ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే.