‘కందిరీగ’ దర్శకుడితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం

కెరీర్ మొదలు పెట్టిన అయిదేళ్ల తరువాత తొలి హిట్ అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘రాక్షసుడు’ లో అతని నటనకు కూడా ప్రశంసలే దక్కాయి. ఈ క్రమంలో అతని తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి ఉంది ప్రేక్షకులకి.

ఆ మధ్యన ‘కందిరీగ’ సినిమాతో హీరో రామ్ కి హిట్ ఇచ్చాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఇతను బెల్లంకొండ కు ఒక మాస్ ఎంటర్టైనర్ కధ చెప్పగా అది నచ్చి ఓకె చేసాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.