మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. శ్రుతిహాసన్ కథానాయిక. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన క్రాక్ పోస్టర్లు.. టీజర్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. రవితేజ- గోపిచంద్ టీమ్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తోందని.. థ్రిల్లర్ వర్కవుటయ్యే ఛాన్సుందని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కలేనని అభిమానులు భావిస్తున్నారు. కొవిడ్ మహమ్మారీ విజృంభణతో పరిశ్రమ స్థబ్ధుగా ఉంది. థియేటర్లు తెరిచే వీల్లేకపోవడంతో ఇన్నాళ్లు వేచి చూసిన రవితేజ ఓటీటీ రిలీజ్ కి అంగీకరించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఆమె పాత్ర సూపర్ స్పెషల్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రవితేజతో నువ్వా నేనా? అంటూ పోటీపడి నటించిందట. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా 2020 మే 8 న విడుదల కావాల్సి ఉండగా…లాక్డౌన్ కారణంగా ఆశించినది ఏదీ జరగలేదు. షూటింగ్ సహా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ కి సర్వం సిద్ధం చేస్తున్నారట.