కరోనా వైరస్ విళయతాండం చేస్తున్న వేళ ఇది. దీని కారణంగా దేశాన్ని కాపాడటం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మహమ్మరిని తరిమేయాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం అని నమ్మి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా బంద్‌ని పాటిస్తున్న విషయం తెలిసిందే. సర్వం బంద్ కావడంతో సినిమా షూటింగ్లు కూడా బంద్ అయిపోయాయి. దీంతో సినీ కార్మికులకు, డైలీ లేబర్‌లకు పని లేకుండా పోయింది.
ఇది గమనించిన చిరంజీవి కరోనా క్రైసిస్ (సీసీసీ) పేరుతో ఓ ఛారిటీని ప్రారంభించారు. దీనికి తొలిగా ఆయనే కోటి విరాళం ప్రకటించారు కూడా. దీంతో చాలా మంది క్రేజీ స్టార్స్ లక్షలు, కోట్లు విరాళాలు ప్రకటించారు. అలా ప్రకటించిన మొత్తం 6 కోట్లు దాటింది. ఇంత జరుగుతున్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏం జరుగుతోంది?. విజయ్ ఎందుకు సైలెంట్ అయ్యాడని అంతటా చర్చమొదలైంది.
అంతా చర్చ జరుగుతున్న వేళ మొత్తానికి విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికా స్పందించాడు. ముఖానికి మాస్కుని ధరించిన ఫొటోని షేర్ చేసిన విజయ్.. మాస్కులని డాక్టర్లకు, నర్స్‌లకు వదిలేద్దామని, మనం మాత్రం కర్చీఫ్‌లని వాడదామని పిలుపునిచ్చాడు. నా ప్రియబైన వారంతా బాగున్నారని నమ్ముతున్నాను. క్లాత్‌లతో తయారు చేసిన మాస్క్ లను వాడదాం. సేఫ్‌గా వుందాం, సురక్షితంగా వుందామని ట్వీట్ చేయడం ఆకట్టుకుంటోంది. మొత్తానికి మా రౌడీ హీరో స్పందించాడని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.