సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ఇది పంట చేతికి వస్తే రైతులు చేసుకునే పెద్ద పండగ మాత్రమే కాదు. సినిమావాళ్ళకి కూడా పెద్ద పండగే. ఈ సంక్రాంతి బరిలో ఈ సారి నాలుగు చిత్రాలు పోటీ పడ్డాయి. ఒకటి రజనీకాంత్ ` దర్బార్`, మహష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`, అల్లుఅర్జున్ `అలవైకుంఠపురంలో` విడుదలై యావరేజ్ టాక్‌ను సంపాదించుకున్నాయి. అయితే పండగరోజు విడుదలైన నందమూరి హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం `ఎంతమంచావాడవురా` చిత్రం మాత్రం ఎందుకో ఆశించినంత మంచి టాక్ ను సంపాదించుకోలేకపోయింది.
కళ్యాణ్ రామ్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామా “ఎంత మంచివాడవురా” కాస్త విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కినట్టు అనిపించే ఫస్ట్ హాఫ్ ఆకట్టుకునే ఫ్యామిలీ ఎపిసోడ్స్ తో కొంతవరకు ఆకట్టుకున్నాయి. కానీ సెకండాఫ్ లో సరైన నరేషన్ లేకపోవడం అంత ఆసక్తికరంగా సాగని కథనాల మూలంగా కథ పూర్తిగా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టునే ఎమోషన్స్ బాగానే ఉన్నా కేవలం అవే ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు నెట్టుకొస్తాయో చూడాలి మరి.
స్టోరీలో ఎమోషన్స్ ఉన్నా కూడా కాస్తో కూస్తో కామెడీ కూడా ఉంటే చూసే ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టకుండా ఉంటుంది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే ఎమోషన్సో, కామిడీనో ఏదో ఒకటి కాస్త ఎక్కువశాతంలో ఉంటే బావుండేది. కానీ రొటీన్ స్టోరీగా వెళ్ళడంతో చూసే ప్రేక్షకులకు పెద్దగా కిక్ రావడం లేదు. అలాగే హీరో హీరోయిన్ మధ్య కూడా పెద్దగా కాట్టుకునే సీన్లేమీ లేవు. ఎంతకీ బంధాలు, బంధుత్వాలు అని తీసుకున్నకాన్సెప్ట్ బాగానే ఉన్నా `ఆల్ వెల్ ఎమోషన్స్ సప్లై` అనే కాన్సెప్ట్ చూసే ప్రేక్షకుడికి పెద్దగా ఎక్కలేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌నైనా కనీసం ఆకట్టుకుంటుందేమో మరో రెండు రోజులు చూస్తేనేకాని అర్ధం కాదు.