కండ‌లు తిరిగిన ఈ హీరో ఎవరు?

మెలితిరిగిన కండ‌లు..8 ప్యాక్ బాడీ.. అచ్చం హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ త‌ర‌హాలో రెడీ అయి క‌స‌ర‌త్తులు చేస్తున్న హీరో ఆర్య అంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?. షాకింగ్ లుక్‌తో మెలితిప్పిన మీస‌క‌ట్టుతో త‌మిళ హీరో ఆర్య త‌న నెక్స్ట్ మూవీ కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ర‌జ‌నీకాంత్‌తో క‌బాలీ, కాలా వంటి చిత్రాల్ని రూపొందించిన పా. రంజిత్ త్వ‌ర‌లో బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ బ‌యోపిక్ తీయ‌బోతున్నాడు. అందులో ఆర్య హీరోగా బాక్స‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఇందు కోసం గ‌త కొన్ని నెల‌లుగా ఆర్య క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు. నార్త్ చెన్నైకి చెందిన ఓ బాక్స‌ర్ క‌థ‌గా ఈ సినిమా తెర‌పైకి రాబోతోంది. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. అన్బు అరివు యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ చిత్రానికి `సాల్‌పెట్ట పరంబ‌రాయ్‌` అనే టైటిల్ ప్ర‌చారంలో వుంది. ఆర్య ఫిట్‌గా సిద్ధ‌మైన త‌రువాత షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని పా. రంజిత్ గ‌త కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బాక్స‌ర్ లుక్‌లో సిద్ధ‌మైన ఆర్య జిమ్‌లో వ‌ర్క‌వుట్ చేస్తున్న ఫొటోల‌తో పాటు ఓ వీడియోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. ప్ర‌స్తుతం అది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.