`ధృవ` సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఓవైపు అందాల పోటీల్లో భామలంతా ర్యాంప్ వాక్ లతో నువ్వా నేనా? అంటూ పోటీపడుతుంటారు. కిరీటం కొట్టేయాలని టాప్ మోడల్స్ ఎంతో ఆత్ర పడుతుంటారు. అయితే అందాల కిరీటం అందుకోవాలంటే అంత ఈజీనా? అది డిసైడ్ చేసేది ఎవరు? కార్పొరెట్ గురూలే కదా! చివరి నిమిషంలో అంతా ఛేంజ్ అవుతుంది. అర్హత కలిగిన మోడల్ కి ఆ కిరీటం దక్కకుండా చేసి.. తండ్రిని హతమార్చి మోడల్ ని ఎమోషనల్ బ్యాక్ మెయిల్ చేసి అబ్బో విలన్ అరవింద స్వామి ఆడే ఆట మామూలుగా ఉండదు.
అయితే ఇక్కడ సీన్ అలా కాదు కానీ.. సన్నివేశ బలం మాత్రం అలాంటిదే. ప్రస్తుత కరోనా కల్లోలంలో ఉద్యోగాలు కోల్పోయి.. ఉన్న ఉపాధిని పోగొట్టుకుని ఎందరో కకావికలం అయిపోతున్నారు. దీని ప్రభావం కథానాయికలపై మామూలుగా లేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అడపాదడపా అవకాశాలు అందుకుంటూ పెద్ద రేంజ్ కెరీర్ ని ఆశిస్తున్న హీరోయిన్లు తమ మెయింటెనెన్స్ ఖర్చులకు అయినా లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారట. కేవలం హీరోయిన్లే కాదు.. చిన్నా చితకా హీరోలు.. నటీనటులు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు … విలన్ల పరిస్థితి ఇదే. ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపు కట్టాల్సిన ఈఎంఐల గురించి సిబ్బంది జీత భత్యాల గురించి తెగ టెన్షన్ పడిపోతున్నారట ఈ కేటగిరీ నటీనటులు.
ఇక ఓ అందాల కథానాయిక అయితే హైదరాబాద్ లో ఖరీదైన ఇల్లు .. కార్ కొనుక్కుని జబర్ధస్త్ గా ప్లాన్ చేస్కుంది. కానీ ఇంతలోనే కరోనా కాటేయడంతో ఇప్పుడు ఈఎంఐలు కట్టలేని ధీనస్థితికి చేరిపోయిందిట. అసలే ఇమేజ్ .. ఆపై నామోషీ.. తన స్థాయి ఏమాత్రం తగ్గ కూడదు. కష్టం వచ్చినా అస్సలు బయటపడకూడదు. అలా బింకానికి పోతే ఇప్పుడున్న సీన్ మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే ఏం కావాలి. ఆ క్రమంలోనే తనకు క్లోజ్ గా ఉండే ఓ హీరోని సాయం అడిగిందట. ఇక ఇదే అదనుగా సదరు యంగ్ బ్యూటీ ఈఎంఐలు చెల్లించిన హీరోగారు.. సదరు బ్యూటీతో క్వారంటైన్ పేరుతో సరాగాలు పలికించేస్తున్నారట. దొరికిందే ఛాన్స్ కదా అని సదరు బ్యూటీతో రొమాంటిక్ గా అడ్వాన్స్ అయిపోయాడట. ఇక చేసేదేమీ లేక ఆ అందాల భామ కూడా అతడికి కమిటైపోయి ఈఎంఐ ల భారం అతడిపై వేసినా కావాల్సినంత కోఆపరేట్ చేస్తోందట. కరోనా ఎంత ముప్పు తెచ్చింది?