అనుకోని ఉపద్రవం కరోనా. దీని కారణంగా అన్నిరంగాలు నష్టాలని చవిచూస్తున్నాయి. దీని ప్రభావం కారణంగా అన్నింటితో పాటు సినిమా రంగం కూడా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ లో లాక్ డౌన్ విధించడంతో ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సినీ ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ చాలా ముఖ్యమైనది కీలకమైనది కూడా. సంక్రాంతి, దసరా తరువాత సమ్మర్ సినిమా ఇండస్ట్రీకి అత్యంత కీలకం.
తెలుగు సినిమాకి ఈ సీజన్ లేకుండా కరోనా భారీ దెబ్బకొట్టింది. దీంతో చాలా వరకు క్రేజీ సినిమాలు రిలీజ్‌లని వాదా వేయాల్సిన పరిస్థితి. ఈ నెలలో రిలీజ్ వాయిదా వేసుకున్న చిత్రాలన్నీ మే లేదా జూన్‌కి వచ్చే అవకాశం వుంది. అయితే ఆ నెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ జూలై లేదా ఆగస్టుకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి.
నాగచైతన్య సినిమా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కాస్త మే 29కి మారింది. ఇప్పుడు ఆ డేట్ కూడా మరినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా ఈ చిత్రాన్ని ఆగస్టుకు మార్చినట్టు తెలిసింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ డేట్లు ఊహించని స్థాయిలో మారిపోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.