ఇక్క‌డైతే అలాంటి సీన్లు అవ‌స‌రం లేదంటున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ భామల్లో నర్గిస్ ఫక్రి ఒకరు. పాక్ సంతతికి చెందిన కెనడా బ్యూటీ… వెండితెరపై అందాలు ఆరబోసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయదు. ఇక ఆఫ్ స్క్రీన్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘రాక్‌స్టార్’ సినిమాతో స్టార్‌డం సంపాదించుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆ తర్వాత అర కొర సినిమాలు చేసి తన పర్సనల్ లైఫ్‌లో సమస్యలు రావడంతో వెండితెరకు కూడా దూరమయింది. రాక్ స్టార్’.. ‘మద్రాస్ కేఫ్’.. ‘కిక్’.. ‘హౌస్ ఫుల్ 3’ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నర్గిస్ ఫక్రి ఈమధ్య కెరీర్ లో కాస్త స్లో అయింది.
అయితే నర్గిస్ బాలీవుడ్‌లోకి ఎందుకు వచ్చిందో వెల్లడిస్తున్న ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది. బాలీవుడ్ సినిమాల్లో సెక్స్ సన్నివేశాలు ఉండవు కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారట నర్గిస్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. తన విలువలు కోల్పోయే పనులు, సినిమాలు ఎప్పుడూ చేయనని తెలిపారు. అందుకే ప్లేబాయ్ మ్యాగజైన్ అర్థనగ్నంగా ఫొటోషూట్లలో పాల్గొంటే కోట్లు ఇస్తామన్నా కూడా ఒప్పుకోలేదని పేర్కొన్నారు.

‘నేను మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ప్లేబాయ్ మ్యాగజైన్ నిర్వాహకులు మా కాలేజ్‌కి వచ్చారు. అబ్బాయిలతో కలిసి సెక్స్ చేస్తున్నట్లుగా పోజులిస్తూ ఫొటోషూట్లు చేస్తే కోట్లల్లో పారితోషికం ఇస్తారని తెలిసింది. నేను ఒప్పుకుని ఉంటే నాకు ఎంతో డబ్బు వచ్చేది. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. నాకు బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడి సినిమాల్లో నగ్నంగా కనిపించే అవసరం ఉండదు, సెక్స్ సీన్లలో నటించే పని కూడా ఉండదు’ అని తెలిపారు. దీనిని బట్టి చూస్తే నర్గిస్ అసలు బాలీవుడ్ సినిమాలు చూడరేమో అనిపిస్తోంది.