ఆ ముగ్గురి సినిమాలు అందుకే విడుదల కాలేదు

2018లో చిరంజీవి , వెంకటేష్, ప్రభాస్  నటించిన సినిమాలు విడుదల కాలేదు . చిరంజీవి ఖైదీ  నెంబర్ 150 తరువాత కథను ఎంపిక చేసుకోవడాన్ని ఎక్కువ సమయం తీసుకున్నాడు . 

సైరా నరసింగా రెడ్డి కథను ఎంపిక చేసుకొని ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నాడు . ఇది చిరంజీవి నటించిన అన్ని భారీ సినిమాల కన్నా ఎక్కువ బడ్జెట్ తో తయారవుతుంది . 2019 లోనే ఈ సినిమా విడుదలవుతుంది

ఇక వెంకటేష్ చాలా కాలంగా తనకు తగ్గ పాత్రలను ఏమికా చేసుకుంటున్నాడు . ఇంకా హీరోగానే నటించాలనే పద్దతికి స్వస్తి పలికాడు . విభిన్న పాత్రలలో నటిస్తున్నాడు . గత సంవత్సరం వెంకటేష్ నటించిన గురు సినిమా విడుదలయ్యింది . తారువాత కథల ఎంపికలో  ఆలస్యం కావడంతో ఆయన నటించిన సినిమాలు ఈ సంవత్సరం విడుదల కాలేదు . ప్రస్తుతం రెండు సినిమాలు నిర్మాణంలో వున్నాయి .

బాహుబలి తరువాత ప్రభాస్ స్థాయి పెరిగింది . అతని మార్కెట్ కూడా విస్తృతమైంది . అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా జాగ్రత్త పడ్డాడు . అందుకే ప్రభాస్ నటించిన ఈ సినిమా  నిర్మాణం జరగలేదు .  ప్రస్తుతుకం ప్రభాస్  నటిస్తున్న సాహో సినిమా నిర్మాణంలో వుంది . ఇది అత్యంత భారీ బడ్జెట్ మూవీ . వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదలవుతుంది .