ఆ పాత్ర మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్‌ అంటున్న బాలకృష్ణ, జూ ఎన్టీఆర్?

ఆ పాత్ర మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్‌ అంటున్న బాలకృష్ణ, జూ ఎన్టీఆర్?

టాలీవుడ్‌లో ఓ పాత్ర చేయ‌మ‌ని అడిగితే మాకు వ‌ద్దంటే వ‌ద్దు బాబోయ్ అంటూ నంద‌మూరీ హీరోలు పారిపోతున్నారు. అదేంటి? క‌్యారెక్ట‌ర్ చేయ‌మంటే పారిపోవ‌డం ఏంట‌ని ఆరాతీస్తే షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌టికొచ్చింది. నంద‌మూరి హీరోలు వ‌ద్దంటు పాత్ర మ‌రెవ‌రితో కాదు అన్న‌గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ పాత్ర‌.

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మించిన చిత్రం `మ‌హాన‌టి`. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న చందంగా న‌టించి త‌న‌ని విమ‌ర్శించిన వారినే విస్మ‌యానికి గురిచేసింది.

ఈ సినిమాలో అన్న‌గారి పాత్ర‌లో న‌టించ‌మ‌ని ఎన్టీఆర్‌ని సంప్ర‌దిస్తే పెద్దాయ‌న పాత్ర చేయాలంటే అదృష్టం వుండాలి.. స్థాయి వుండాలి. అయితే ఆ స్థాయి త‌న‌కు లేదు. అందుకే ఆ పాత్ర‌ను తాను చేయ‌న‌ని ఎన్టీఆర్ నైస్‌గా త‌ప్పించుకున్నాడు.

తాజాగా జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌. విజ‌య్ `త‌లైవి` పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర చేయ‌మ‌ని యంగ్ టైగ‌ర్ ని అడిగాడ‌ట‌. ఇక్క‌డా సేమ్ స్టోరీ వినిపించాడ‌ట‌. దాంతో ఈ టీమ్ బాల‌కృష్ణ‌ను సంప్ర‌దించార‌ట‌. నా వ‌ల్ల కాద‌ని బాల‌య్య కూడా చేతులెత్తేయ‌డంతో మ‌రో న‌టుడిని వెతుక్కునే ప‌నిలో ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌. విజ‌య్ బిజీ అయిపోయాడ‌ట‌.