ఇటీవల సంచలనాలు క్రియేట్ చేసిన ఏడుచేపల కథ లో టెంప్ట్ రవి గా దూసుకుపోయిన అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా జంటగా, ఏడు చేపల కథ చిత్ర నిర్మాతల్లో ఒకరైన జి.చరితా రెడ్డి నిర్మాతగా లక్ష్మి చరిత ఆర్ట్స్ మరియు జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో రేష్మి హీరోయిన్ గా అంతం అనే చిత్రానికి దర్శకత్వం వహించిన జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్రం వైఫ్. ఈ చిత్రానికి నైఫ్ బెటర్ దెన్ వైఫ్ అనే క్యాప్షన్ ని పెట్టారు.. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాన్సెప్ట్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. డైరెక్టర్ వీరభద్రం చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో..
హీరో అభిషేక్ మాట్లాడుతూ…. ఏడు చేపల కథకు 4 కోట్ల గ్రాస్ వచ్చింది. నటుడిగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అన్ని వర్గాల్ని మెప్పించలేదు. కానీ ఈ సినిమా నిరాశ పర్చదు. మా దర్శకుడి వన్ మ్యాన్ షో. ఏలూరు సీను డైరెక్టర్ ని నాకు పరిచయం చేశాడు. వైఫై సినిమాకు నిర్మాతలు సుచరరిత గారు, లక్ష్మి రెడ్డి గారు బాగా సపోర్ట్ చేశారు. నామీద నమ్మకంతో నిర్మాతలు డబ్బు పెట్టారు. అందరూ నవ్వాలనే కసిగా చేశాం. ప్రతీ సీన్ నవ్వించే ప్రయత్నం చేసాం. ఎవ్వరూ నిరాశ పడరు. అని అన్నారు. దర్శకుడు కథ, మాటలు, డైలాగులు, పోస్టర్లు డిజైన్ చేస్తారు అన్నీ చేస్తారు అని చెప్పారు. అలాగే డైరెక్టర్ డిపార్ట్‌మెంట్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. సంతోష్ పని రాక్షసుడు చాలా కష్టపడతాడు. అలాగే మా కోడైరెక్టర్ హీరోయిన్ రాత్రి తొమ్మిదయిందంటే చాలు ఓడ్కా తాగేసి ఇద్దరూ గదిలోనే ఉంటారు అన్నాడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారో అది తర్వాత విషయం. రాత్రి ఎంత ఆలస్యమైనా ఉదయం మాత్రం ఆరుగంటలకే వచ్చి ఇద్దరూ షాట్ రెడీ అంటూ డెడికేషన్‌గా ఉంటారు. నన్ను డ్రాయర్ మీద నిలబెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. నా బాధలు ఏంచెప్పను లేండి అని అన్నారు.
గురువుగారు రెడీ లిప్‌లాక్ అంటారు. అది సిగరెట్ తాగేసి, గంజాయి కొట్టాసి కమాన్ అంటది నాకు కంపు కొట్టుద్ది దగ్గరికి వెళ్ళలేను రొమాన్స్ అంటాడు ఏం మూడ్ వచ్చుద్ది. రెఢీ రెఢీ అంటారు కొంచం నోరు కడుక్కోమను నాకు వాసన వస్తుంది అనేవాడ్ని రాత్రిరెండు గంటలకి డ్రాయిర్ వేసి స్విమ్మింగ్ పూల్‌లో దించుతాడు ఏం చెప్పాలి నా బాధలు చలి వేస్తా ఉంటది. రొమాన్స్ ఫీల్ తీసుకురామంటాడు చలేస్తది ఏం ఫీలొస్తది. ఈయనగారికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది. ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పను. ఆ అమ్మాయి లేకపోతే మనోడికి ఉత్సాహం రాదు. ఆ అసిస్టెంట్ ఈయన్ని ఏవండీ… అని పిలిచేది. చక్కగా ఆయన ఎంజాయ్ చేసుకుంటూ సినిమా తీశాడు. మాకు మాత్రం నోట్లో మట్టికొట్టాడు. నాకు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా వచ్చి ఇలాంటి అవకాశాలే ఇస్తున్నారు. పైకి ఎక్కు దిగు సినిమా అదిరిపోతది అంటున్నారు. నేను అలాంటి సినిమాలు చెయ్యనుసార్ ఏదో కామెడీ కోసం చేశానన్నా ఎవ్వరూ నమ్మడంలేదు. అలాగే ఈ సినిమా సెన్సార్ మొత్తం పూర్తయిపోయింది.