‘ఆ డైరక్టర్ నా తొడలు చూడాలి అన్నాడు’: శర్వానంద్ హీరోయిన్

శర్వానంద్ హీరోయిన్ ..క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు గత కొంతకాలంగా సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఈ వివాదంలో ఇరుక్కుని సినిమా ఛాన్స్ లు సైతం పోగొట్టుకున్నారు. అవకాశాల పేరుతో లైంగిక కోరికలు తీర్చమనే వారు చాలామంది ఎదురయ్యారైనట్టుగా చాలా మంది ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి చెప్పారు..చెప్తున్నారు. తాజాగా మరో మాజీ హీరోయిన్ తనతో ఓ దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఆమె మరెవరో కాదు సుర్వీన్ చావ్లా. తాజాగా ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వూలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

సుర్విన్ చావ్లా మాట్లాడుతూ…ఓ సినిమా షూటింగ్ సమయంలో ఓ దర్శకుడు తన శరీర భాగాలను చూడాలనుకున్నాడని, మరో దర్శకుడు తన తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ దర్శకుల పేర్లను సుర్వీన్ బయటపెట్టలేదు.

రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో ఆఫర్స్ కోసం వెళితే.. ‘నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను’ అని ఒక దర్శకుడు, ‘నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను’ అని మరొక దర్శకుడు కోరారు. వాళ్ల ఆఫీసుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు.

ఇక సౌత్‌లో ఓ చిత్రదర్శకుడు ‘నీ శరీరంలోని ప్రతి భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం మానేశాను. ఇంకోసారి ఓ నేషనల్‌ అవార్డు పొందిన దర్శకుడుకి ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ఆడిషన్‌లో అనవసరమైన డైలాగ్స్‌ చెప్పించి, ఏదో ఏదో చేయించాడు అని అన్నారామె.

సుర్వీన్‌… 2009లో వచ్చిన ‘రాజు మహారాజు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో ఆమె శర్వానంద్‌కు జోడీగా నటించారు. హిందీలో ‘హమ్‌ తుమ్‌ షబానా, అగ్లీ, హేట్‌ స్టోరీ 2, పార్చడ్, తమిళంలో ‘మూండ్రు పేర్‌ మూండ్రు కాదల్, పుదియ తిరుప్పంగళ్‌’ సినిమాల్లో నటించారామె. సుర్వీన్ నటించిన చివరి చిత్రం 2017లో వచ్చిన ‘ఛురీ’.