ఆ ఇద్దరితో కాంబినేషన్ రిపీట్ చేసిన కాజల్

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా ఓ సినిమా రాబోతుంది. తేజ-కాజల్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. శ్రీనివాస్ తో రెండో సినిమా కాజల్ కి. ఈ చిత్రాన్ని ఏటీవి సమర్పణలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైద్రాబాదులో స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో డైరెక్టర్ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు తేజ ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు.

ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఈ మూవీ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది అన్నారు. సోమవారం నుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని చెప్పారు. సోనూ సూద్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి దానం నాగేందర్, నటుడు అభిమన్యు సింగ్ పాల్గొన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: శీర్షరే
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు