అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆల్ట్ బాలాజీ వంటి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లకు ధీటుగా అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా`. మై హోమ్ రామేశ్వరరావు మేజర్ వాటాతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభానికి ముందు అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఓటీటీ కోసం తీసుకున్నారు. దీంతో భారీ రేంజ్లో నెటిజన్స్ నుంచి స్పందన లభిస్తుందని ఊహించిన అల్లు అరవింద్‌కు భారీ షాక్ తగిలింది.
లెక్కల్లోనే తప్ప రియల్ టైమ్ సబ్స్క్రైబర్స్ లేకపోవడంతో ఆహా ఓటీటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉగాది నుంచి అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేసిన యాడ్‌తో అయినా ఆహా అనిపించాలని ప్రయత్నాలు చేశారు. అయితే అది కరోనా వైరస్ కారణంగా పూర్తి కాకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమం బొదలైంది.
ఈ టైమ్‌లోనే ఆల్ట్ బాలాజీని సైతం మరిపించే స్థాయిలో వెబ్ సిరీస్‌లు ఆమా కోసం రెడీ కావడంతో అడల్ట్ కంటెంట్‌ని ఆహాలో నింపేసి వ్యూవర్స్‌ని ఆకట్టుకోవాలని కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. అల్లు అరవింద్ ప్లాన్‌ని కొత్త వెబ్ సిరీస్ `సిన్` బాగానే వర్కవుట్ చేసేలా వుంది. తిరువీర్, దీప్తి సాథి, బ్రెజిల్ హాటీ జెన్నీఫర్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఎవరికి వారే ఓ రేంజ్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇష్టం లేని భార్యని బలవంతంగా అనుభవించే ఓ షాడిస్టు భర్తగా తిరువీర్, భర్త చేతిలో రేప్‌కు గురయ్యే భార్యగా దీప్తి, వీరిద్దరి మధ్యలోకి ఎంటరయ్యే యువతిగా జెన్నీఫర్ నటించింది. ఇటీవల విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ యూట్యూబ్‌లో కుమ్మేస్తోంది.
ఈ తరహా అడల్ట్ కంటెంట్ వున్న వెబ్ సిరీస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆల్ట్ బాలాజీ. `సిన్` లాంటి సిరీస్‌లతో ఆహా ఓటీటీ ఆల్ట్ బాలాజీనే అదిమించేలా ప్లాన్ చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొత్తానికి అల్లు అరవింద్ అడల్ట్ కంటెంట్ పేరుతో బూతుని నమ్ముకున్నాడని ఇండస్ట్రీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.