మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం వీరిద్దరు ఎక్కడ కలిశారు?. ఎలా కలిశారు? ఎందుకు కలిశారు? కఒంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని ఎందుకు గడిపారు. చదువురాని కొమరంభీం ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు? స‌్వాతంత్య్ర పోరాటంలో వీరిద్దరు ఏ స్థాయిలో పోరాటం చేశారు? అనే ఆసక్తికర విషయాలని ఓ ఫిక్షనల్ కథగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్నారు.
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకెత్తుతోంది. దాదాపు 450 కోట్ల భారీ వ్యయంతో భారతీయ తెరపై ఇంత వరకు రాని సరికొత్త కథని రాజమౌళి తెరపైకి తీసుకొస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ పకంగా ఇండియన్ సినిమాల్లో సరికొత్త చరిత్ర సృష్టించినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ కోసమే దాదాపు 150 కోట్లు ఖర్చు చేస్తున్న ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని స్టార్ ఇండియా గ్రూప్ సంస్థ అత్యధిక మొత్తాన్ని అంటే 250 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.
పది భారతీయ భాషలకు కలిసి ఈ మొత్తం చెల్లించినట్టు చెబుతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సినిమా డిజిటల్ రైట్స్ ఇంత భారీ బొత్తానికి అమ్ముడు పోవడం ఇదే ప్రధమం కావడంతో ఈ విషయంలో `ఆర్ ఆర్ ఆర్` రికార్డుల కెక్కబోతోంది.