అల్లరి నరేష్ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంలో పడిపోయింది. గత కొంత కాలంగా అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాన్ని సాధించడం లేదు. దాంతో కొంత విరామం తీసుకున్న అల్లరోడు వరుసగా విభిన్నమైన చిత్రాల్ని అంగీకరిస్తున్నారు. ఇటీవల `నాంది` పేరుతో ఓ థ్రిల్లర్ చిత్రాన్ని మొదలుపెట్టిన అల్లరి నరేష్ ఇంతకు ముందే `బంగారు బుల్లోడు`ని కూడా పట్టాలెక్కించాడు.
అయితే గతేడాది మొదలైన ఈ సినిమా షూటింగ్ అనూహ్య పరిణామాల మధ్య నత్తనడకన సాగుతోంది. ఇదిలా వుంటే అల్లరిరోడితో ఓ వెరైటీ చిత్రాన్ని నిర్మించాలని సురేష్ నంకొడక్ష్సన్స్ అధినేత డి. సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఓ కొరియన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం కోసం రైట్స్ తీసుకున్నారని తెలిసింది. 2012లో వచ్చిన కొరియన్ చిత్రం `డ్యాన్సింగ్ క్వీన్`. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న సురేష్ బాబు ఇందులో హీరో పాత్ర కోసం అల్లరి నరేష్‌ని ఫిక్స్ చేశారట.
ఇక టైటిల్ పాత్రలో క్వీన్‌గా కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని భావించిన సురేష్‌బాబు ఇటీవలే ఓ ప్రపోజల్‌ని కాజల్ ముందు పెట్టారట. డీల్ నచ్చడంతో కాజల్ కూడా ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఈ రీమేక్‌ని ఎవరు తెరకెక్కిస్తారు?, మిగతా నటీనటులు ఎవరు? అన్న వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది.