HomeTollywoodఅలీ హీరోగా సినిమా... సుకుమార్ సాయం

అలీ హీరోగా సినిమా… సుకుమార్ సాయం

సుకుమార్ కు నచ్చి ఓకే చేసిన సినిమా

ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే విషయంలో ఎంత ఫెరఫెక్ట్ గా ఉంటారో ఆయన సినిమాలు చూస్తే అర్దమవుతాయి. అలాంటి దర్శకుడు వేరే సినిమా కథ విని, స్క్రీన్ ప్లే నచ్చి సినిమా చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆ సినిమా ఎలా ఉండబోతోంది. ఆ విషయం ఈ రోజు మనకు తేలబోతోంది. ఆ సినిమా పేరు ‘పండుగాడి ఫొటో స్టూడియో’. ఈ సినిమాలో హీరో అలీ. దర్శకుడు దిలీప్ రాజా.

వివరాల్లోకి వెళితే…అలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటోస్టూడియో’. దర్శకుడు దిలీప్ రాజా చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా కథనాన్ని దర్శకుడు సుకుమార్‌గారు ఓకే చేసిన తర్వాత చిత్రీకరణ మొదలుపెట్టాం. మంచి సజెషన్స్ ఇచ్చిన ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ’’ అన్నారు .

అలాగే ‘‘ఎవరి సినిమా వారికి నచ్చుతుంది. కానీ నచ్చాల్సింది ప్రేక్షకులకు. వారికి నచ్చితేనే అది గొప్ప చిత్రం అవుతుంది. ప్రేక్షకులకు నా సినిమా నచ్చితే తెలియజేయండి.. నచ్చకపోతే తిట్టండి. ఎక్కడైనా తప్పు ఉంటే ఎత్తిచూపండి.. సరిదిద్దుకుంటాను. ఆలీ హీరోగా నేను తెరకెక్కించిన పండుగాడి ఫొటో స్టూడియో సినిమా మంచి కంటెంట్‌తో మీ ముందుకు రాబోతోంది. ఇందులో ఆలీ ఎవరికి ఫొటో తీస్తే వారికి పెళ్లయిపోతుంది. ఎందుకని పెళ్లిళ్లు జరుగుతున్నాయో, దానికి సంబంధించిన కారణాలు సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. పూర్తి గ్రామీణ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రంలో గొడుగు గోవిందం, చెంబు లింగం, బేడర్థణాగాడు, మెంటల్ మాలచ్చిమి, మిలట్రీమామ వంటి పాత్రలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి అన్నారు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News