సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన దగ్గరి నుంచి సెలబ్రిటీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ పెట్టాలన్నా సెలబ్రిటీలు వణికిపోతున్నారు. ఏ పోస్ట్ పెడితే ఎవరు ట్రోల్ చేస్తరో.. ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని కంగారు పడుతున్నారు. కొంత మంది ధైర్యం చేసి తాము అనుకున్న దానిపై స్పందిస్తే వెంటనే ట్రోల్స్ మొదలవుతున్నాయి. గత కొంత కాలంగా యాంకర్, నటి అనసూయ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
గత కొన్ని రోజులుగా అనసూయ అవకాశాల కోసం వరుస ఫొటో షూట్లకు పోజులిస్తూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేస్తోంది. వీటిపై కామెంట్లు పడుతూనే వున్నాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ బూతుపురాణం విప్పడం షాక్‌కు గురిచేసింది. దీంతో అనసూయ సదరు నెటిజన్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల్ని సంప్రదించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కాంమెంట్లు చేసిన నెటిజన్ని వెతికి పట్టుకుంటామని, ఆ బూతు కామెంట్స్ డెలిట్ చేయిస్తామని అనసూయకు సర్ది చెప్పారట. దీంతో అనసూయ శాంతించిందని తెలిసింది.