Home Tollywood అనుష్క 'నిశ్శబ్దం'కొత్త పోస్టర్ లో పజిల్!

అనుష్క ‘నిశ్శబ్దం’కొత్త పోస్టర్ లో పజిల్!

అనుష్క సినిమా పజిల్ లాగ ఉండబోతోందా?

అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘నిశ్శబ్ధం’. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలోని అనుష్క లుక్‌ను ఈనెల 11న ఉదయం 11.11గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇప్పటికే టైటిల్‌ను లుక్‌ను విడుదల చేశారు. ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. అయితే టైటిల్‌ పోస్టర్‌ను మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. రెండు చేతులకు రకరకాల రంగులు పులుముకుని 301 అనే సంఖ్యను చూపిస్తుండగా.. అందులో ఓ చేతికి తాళం బ్రేస్‌ లేట్‌లా వేలాడదీసి ఉంది.

ఆ చేతుల బ్యాగ్రౌండ్‌లో పాడుబడిన ఓ పెద్ద ద్వారం దర్శనమిచ్చింది. మొత్తంగా చూస్తుంటే పొస్టర్‌ను ఓ పజిల్‌లా రూపొందించారు. మాధవన్‌, మైఖేల్‌ మాడ్సెన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజులు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి గోపీ సుందర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

కనిపించేంత సులువు కాదట.. ప్రాక్టీస్ సెషన్‌లొ ఆండ్రియా

సినిమాలోని పాత్రల కోసం కొంత మంది విపరీతంగా కష్టపడుతుంటారు. అలా పాత్రల కోసంప్రాణం పెట్టేవారికి మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే పరిమితమైతే నటించేందుకు స్కోప్ ఉండే పాత్రలు అంతగా రావు....

అమ్మ బాబోయ్ త్రివిక్రమ్‌తో భారీ స్కెచ్ వేశారే.. పాపం మధ్యలో ఆ డైరెక్టర్ బక్రానా?

రీమేక్ సినిమాలను తెరకెక్కించడం అంత చిన్న విషయమేమీ కాదు. మన ప్రాంతం, పద్దతులు, జీవిన విధానం ఇలా అన్నింటికి సరిపడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. కథలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడి జనాలను...

ఇది మామూలు క్రేజ్ కాదు.. అభిజిత్‌కు రోహిత్ శర్మ గిఫ్ట్

అభిజిత్‌కు ప్రస్తుతం ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అతని మెచ్యూరిటీ, స్టార్ట్ నెస్, కూల్ నెస్, మాట్లాడే విధానం ఇలా ప్రతీ ఒక్కటి అందరినీ కట్టిపడేసింది. మామూలు జనాలనే కాకుండా.. సెలెబ్రిటీలను...

‘ఉప్పెన’ వచ్చేది ఎప్పుడంటే?

కరోనా లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా వాయిదా పడిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే...

Latest News