అనుప‌మని ఓకే చేసిన దిల్ రాజు!

`రాక్ష‌సుడు` సినిమా త‌రువాత మ‌రో చిత్రాన్ని అంగీక‌రించ‌ని మ‌ల‌యాళీ సోయ‌గం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెమెరా వెన‌క్కి వెళ్లి కొత్త అవ‌తారం ఎత్తిన అనుప‌మ మ‌ళ్లీ కెమెరా ముందుకు రాబోతోంది. తాజాగా ఆమె దిల్ రాజు చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. దిల్ రాజు త‌న సోద‌రుడు శిరీష్ త‌న‌యుడు ఆషిష్ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అది ఇప్ప‌టికి సెట్స్‌పైకి రాబోతోంది. `హుషారు` చిత్రాన్ని రూపొందించిన హ‌ర్ష కొనుగంటి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల సైలెంట్‌గా ఇటీవ‌ల ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని మొద‌లుపెట్టేశారు. ఎలాంటి ఆర్భాటాల‌కు పోకుండా సైలెంట్‌గా సినిమాని పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకు అనుప‌మ అయితేనే బాగుంటుంద‌ని దిల్ రాజు భావించి ఆమెని ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఇటీవ‌ల దిల్ రాజు నిర్మించిన `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` చిత్రంలో అనుప‌మ న‌టించిన విష‌యం తెలిసిందే.