”వాడు ఎవడు ” మూవీ రివ్యూ & రేటింగ్

నటీ నటులు : ఆర్. కార్తికేయ,అఖిల నాయర్, రాజ్ కుమార్, షైని, జూలీ, హర్షిత, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, తదితరులు

సాంకేతిక నిపుణులు

సినిమా : “వాడు ఎవడు”.
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 10.03.2023
బ్యానర్ : రాజేశ్వరి సినీ క్రియేషన్స్
దర్శక, నిర్మాత : ఎన్.శ్రీనివాసరావు
కథ-మాటలు-స్క్రీన్ ప్లే: రాజేశ్వరి పాణిగ్రహి,
సంగీతం: ప్రమోద్ కుమార్,
చాయాగ్రహణం: విజయ గండ్రకోటి,
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ టి,
పి. ఆర్. ఓ : ఆర్. కె. చౌదరి

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక శక్తులను మహిళలు ఎదుర్కోలేక వాళ్ళ అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. అనేటటువంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక మంచి మెసెజ్ ఇచ్చే సస్పెన్సు థ్రిల్లర్ కథే “వాడు ఎవడు”. మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై కార్తికేయ, అఖిల నాయర్ హీరో హీరోయిన్లుగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ” వాడు ఎవడు ”. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు,టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ : వైజాగ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసుకోని చేసిన సినిమా “వాడు ఎవడు” ఇది.సినిమా స్టార్ట్ అయిన ఓపెనింగ్ సీన్ లోనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది . వెంటనే అమ్మాయి తల్లి తండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారోచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోతారు. ఆ తరువాత హీరోయిన్ చైత్ర (అఖిల నాయర్ ) కు ఫాధర్ ఫోన్ చేస్తే వస్తున్నానని చెపుతుంది. ఆలా చెప్పిన తను రాత్రి 12 అయినా ఇంటికి రాదు.దాంతో చైత్ర పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లెన్ట్ ఇస్తారు. అయితే చివరగా మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా హీరో ఫ్రెండ్స్ ను పట్టుకుని ఈ అమ్మాయి మీకెలా పరిచయం అని అడుగుతారు.అందులో హీరో అశ్వక్ (ఆర్. కార్తికేయ) తను,నేను లవర్స్ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటాడు. ఆది కన్ఫామ్ చేసుకున్న పోలీసులు. హీరోయిన్ తండ్రి నంబర్ ను ట్యాపింగ్ చేస్తారు.. మరుసటి రోజు హీరోయిన్ తండ్రికి కాల్ చేసి డబ్బులు ఇస్తే మీ అమ్మాయిని వదిలిపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటే ఆ అబ్బాయి హీరో ఫ్రెండ్స్ లోని వ్యక్తి కావడం విశేషం.

వాడిని ఇంట్రాగేషన్ చేస్తే నాకు తెలియదు నాకు శివారెడ్డి అనే వ్యక్తి కిడ్నాప్ చెయ్యమన్నాడని చెప్తాడు. వెంటనే అశ్వత్ వెళ్లి శివారెడ్డిని పట్టుకొని అడిగితె చైత్ర ను కిడ్నాప్ చేయాలి అనుకున్నది వాస్తవమే కానీ నేను చేయలేదు అంటాడు.అయితే చైత్ర మాత్రమే కాకుండా చైత్ర లాగే అప్పటికే చాలా మంది ఆమ్మాయిలు కిడ్నాప్ కు గురై ఆ తరువాత వారిలోని కొంతమంది సూసైడ్ చేసుకున్న విషయం తెలుసుకున్న హీరో అశ్వక్ .కిడ్నాప్ అయిన అమ్మాయిలు, చనిపోయిన అమ్మాయిల ఇన్వెస్టిగేషన్‌ ఫైల్స్ ను పోలీసుల ద్వారా తీసుకొని ఎంక్వైరీ చేయడం మెదలు పెడతాడు.అయితే ఈ కిడ్నాప్ ఎవరు, ఎందుకు చేస్తున్నారో.. వారిలో కొందరు ఎందుకు సూసైడ్ చేసుకుంటారో తెలియక ముందు ఇబ్బంది పడినా తరువాత క్రమంలో కొన్ని భయంకరమైన విషయాలు తెలుసుకుంటాడు. పోలీసుల సహాయంతో తాను తెలుసుకొన్న విషయాలు ఏంటి? అసలు ఇంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసే “వాడు ఎవడు”? కిడ్నాప్ చేసే హంతకులను పోలేసుల సహాయంతో హీరో ఎలా పట్టుకున్నారు? చివరకు హీరో అశ్వక్ హీరోయిన్ చైత్ర ను కాపాడాదా లేదా.. అనేది తెలుసుకోవాలంటే కచ్చితంగా “వాడు ఎవడు” సినిమా చూడాల్సిందే…

నటీ, నటుల పనితీరు

హీరో ఆర్. కార్తికేయ అశ్వక్ పాత్రలో చాలా బాగా నటించాడు. తను ప్రేమించిన అమ్మాయి చైత్ర (అఖిల నాయర్) కిడ్నాప్ కు గురైనందున ఆమెను వెతికే క్రమంలో తను చూపించిన హావ భావాలతో పాటు, ఫైట్స్, ఏమోషన్స్, పాటలలో ఇలా అన్ని షేడ్స్ లో చాలా పరిణితి ఉన్న వాడిలా చాలా బాగా నటించి నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. కిడ్నాప్ కు గురైన చైత్ర పాత్రలో నటించిన హీరోయిన్ హర్షిత తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విలన్ పాత్రలో రాహుల్ నటించిన శివ యువన్ చాలా చక్కగా నటించాడు. ఇంకా రాజ్ కుమార్, షైని, జూలీ, ఆంజనేయులు, బాబు దేవ్, సన్నీ, కొండల్రావు, తదితరులు వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే నే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇప్పటి వరకు రానటువంటి కొత్త కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “వాడు ఎవడు”.యుగాలు మారినా టెక్నాలజీ మారినా అమ్మాయిలు మాత్రం మోసం చేసే వారిని నమ్ముతారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి అంటుంటారు. అమ్మాయిలకు పేరెంట్స్ స్వేచ్ఛని ఇస్తే ఆ స్వేచ్ఛను వారు ఏవిధంగా మిస్ యూజ్ చేసుకుంటారు అనే దాని ఆధారంగా ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనలను కథగా రాసుకొని సమాజానికి ఒక మంచి మెసెజ్ ఇచ్చే సస్పెన్సు థ్రిల్లర్ కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో దర్శక, నిర్మాత శ్రీనివాస్ రావు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది. మెల్లగా మెల్ల మెల్లగా.. నాలో సందడేదో రేపినావుగా అనే పాట, ఖర్మ సిద్ధాంతం మీద వచ్చే పాట ఇలా ఇందులో ఉన్న మూడు పాటలు సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. ఈ పాటలను అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన్నట్లు కనిపించింది. సినిమాటోగ్రాఫర్ విజయ్ గండ్రకోటి ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు.రాజేష్ గారిచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టే చాలా చక్కగా కుదిరింది. ,స్రీన్ ప్లే,తో పాటు రాజేశ్వరి పాణిగ్రహి ఇచ్చిన కథ,మాటలు ప్రేక్షకులను ఆలోచింప జేసే విధంగా ఉన్నాయి..సాయి ఆకుల నరేష్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఇందులో సతీష్, రాము, శ్రీనివాస రావు అందించిన మూడు ఫైట్లు బాగున్నాయి.మాధురి, పూజిత సమర్పణలో రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై లో వచ్చిన “వాడు ఎవడు” సినిమా చూసిన తరువాత దర్శక, నిర్మాత శ్రీనివాస రావు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తుంది.ఇందులో కథతో పాటు వినోదం, ఎమోషన్స్, వాల్యూస్,లతో పాటు ప్రేక్షకులకు చక్కటి మెసేజ్ ఇచ్చాడు. మంచి స్కోప్ ఉన్న కథకు తగ్గట్టే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఈ సినిమా చాలా బాగా నిర్మించారు.సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కావాలని కోరుకునే ప్రేక్షకులకు మాత్రం” వాడు ఎవడు ” సినిమా కచ్చితంగా నచ్చుతుంది..