Rama Rao On Duty Review – రివ్యూ : రామారావు ఆన్ డ్యూటీ

Ramarao on Duty

 

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి తదితరులు.

దర్శకుడు: శరత్ మండవ

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.

సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్

ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.

మాస్ మహారాజ్ రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో నేడు రిలీజ్ అయిన ఈ సీరియస్ యాక్షన్ డ్రామా ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం..

కథ :

రామారావు (రవి తేజ్) ఒక సబ్ కలెక్టర్. సిన్సియర్ ఆఫీసర్. న్యాయం కోసం సిస్టమ్ కి వ్యతరేకంగా డ్యూటీ చేసి.. చిత్తూరు జిల్లాకు ఎమ్మార్వో గా రావాల్సి వస్తోంది. రామారావు వచ్చిన ఏరియాకి యస్ ఐగా మురళి (వేణు తొట్టెంపూడి) ఉంటాడు. నిర్లక్ష్యంగా పని చేస్తున్న మురళి పై రామారావు ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు ?, ఈ క్రమంలోనే రామారావు మాజీ లవర్ మాలిని (రజిషా విజయన్) భర్త మిస్ అవుతాడు. అతని వెతికే క్రమంలో రామారావుకి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఏమిటీ ఆ నిజాలు ?, రామారావు – మాలిని ప్రేమ గురించి తెలిసి రామారావు భార్య నందిని (దివ్యాంశ కౌశిక్) ఎలా ఫీల్ అవుతుంది. అసలు మాలిని భర్త ఎలా మిస్ అయ్యాడు ?, దీని వెనుక ఎవరు ఉన్నారు ?, చివరకు రామారావు సాధించింది ఏమిటీ ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో రామారావు పాత్రలో నటించిన రవితేజ, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మరో కీలకమైన పాత్రలో నటించిన వేణు ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా ఇంటర్వెల్ లో అండ్ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రవితేజ నటన చాలా ఎమోషనల్ గా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది. రజిషా విజయన్ కి నటించే స్కోప్ లేదు.

అయితే ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ సినిమా బోర్ కొడుతుంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమా దర్శకుడు శరత్ బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. కీలక సన్నివేశాలను దర్శకుడు తెర పై ఆవిష్కరించిన విధానం కూడా అస్సలు బాగాలేదు. ఇంట్రెస్ట్ కలిగించలేని సన్నివేశాలతో సినిమా బాగా బోర్ గా సాగింది.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ – వేణు నటన, నేపథ్య సంగీతం, కొన్ని యాక్షన్ సీన్స్,

మైనస్ పాయింట్స్ : వెరీ రెగ్యులర్ ప్లే, రొటీన్ మెలో డ్రామా, హీరోయిన్ లవ్ ట్రాక్, లాజిక్స్ మిస్ అవ్వడం, బోరింగ్ ట్రీట్మెంట్,

తీర్పు :

ఈ రామారావు రొటీన్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతోనే సాగాడు. సినిమాలో కొన్ని ఎమోషన్స్ అండ్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. అలాగే రవితేజ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవుతుంది. కానీ సినిమా మాత్రం అస్సలు బాగాలేదు.

రేటింగ్ 2 / 5

బోటమ్ లైన్ :  రామారావు ఆన్ డ్యూటీనే.. కానీ టార్గెట్ మిస్ అయ్యింది.